Home > World News > పాకిస్థాన్ తీరు గర్హనీయం : కేంద్రమంత్రి సుష్మ

పాకిస్థాన్ తీరు గర్హనీయం : కేంద్రమంత్రి సుష్మ

అమరావతికి సింగపూర్ ప్రధాని..
ప్రవాసీయుల్లో భారతీయులే టాప్

sushma-swaraj-apduniaపాకిస్థాన్ జైలులో వున్న కుల్భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ ప్రవర్తించిన తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్ తీరు భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని అమె కులభూషన్ జాదవ్ విషయంపై లోక్ సభలో గురువారం ఒక ప్రకటన చేసిన సుష్మా స్వరాజ్…అన్ని దౌత్య మర్యాదలనూ పాకిస్థాన్ తుంగలోకి తొక్కిందని విమర్శించారు. పాక్ జైలులో కులభూషన్ జాదవ్ ను చిత్ర హింసలు పెడుతున్నారనడానికి కుటుంబ సభ్యులతో భేటీ సందర్భంగా వెలుగులోనికి వచ్చిన ఫొటోలే తార్కానమని చెప్పారు. కులభూషన్ జాదవ్ విడుదల విషయంలో తమ సర్కార్ చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నదని సుష్మ సభకు తెలియచేసారు. కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంపై మాట్లాడుతూ ఆమె ఒకదశలో కంటతడి పెట్టారు. కొడుకుతో తల్లి.. భర్తతో భార్య సమావేశాన్ని పాకిస్థాన్ ప్రచారానికి ఉపయోగించుకుందన్నారు. భద్రత పేరుతో వారు ధరించిన దుస్తులను బలవంతంగా మార్పించారు. మంగళసూత్రాలు తీయించడం బాధాకరమన్నారు. వితంతువులుగా వారిని చూపించారు. కుల్భూషణ్ తల్లితో మాట్లాడా. తనను చూడగానే తండ్రి ఎలా ఉన్నాడని అడిగాడని చెప్పింది. ఎందుకంటే మంగళసూత్రం లేకుండా ఉండటాన్ని గమనించి భయాందోళనకు గురై ఈ విధంగా అడిగాడని ఆమె అన్నారు. ఈ భేటీ సందర్భంగా కుటుంబ సభ్యుల హక్కులు పదేపదే తుంగలో కలిశాయని ఆమె అన్నారు. జాదవ్ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతున్నామని సుష్మా స్వరాజ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com