Post Tagged with: "amaravati"

ఇకపై ఆన్ లైన్లోనే ఎస్ బీఐ సేవింగ్స్ ఖాతా బదిలీ

ఇకపై ఆన్ లైన్లోనే ఎస్ బీఐ సేవింగ్స్ ఖాతా బదిలీ

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐలో ఖాతా ఉన్న వారు దాన్ని తమకు నచ్చిన మరో ఎస్ బీఐ శాఖకు మార్చుకోవడం ఇప్పుడు సులభతరం అయింది. ఎవరికి వారు ఆన్ లైన్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉండడం విశేషం. సుమారు 42 కోట్ల […]

కోటప్పకొండ అభివృద్ధిపై డాక్టర్ కోడెల రివ్యూ

కోటప్పకొండ అభివృద్ధిపై డాక్టర్ కోడెల రివ్యూ

ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండే కోటప్పకొండ ప్రాంతం మనం చేసిన అభివృద్ధితో నేడు టూరిజం, ఆధ్యాత్మికంగా కళకళలాడుతుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కోటప్పకొండ అభివృద్ధిపై గుంటూరు అర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం నాడు టూరిజం శాఖ కమిషన్ శుక్లా, జిల్లా అధికారి మోహన్ ఇతర అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ […]

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పై అనంతపురం తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సోమ వారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి వచ్చిన కేసీఆర్ ను మర్యాదగా కలవడం తప్పా అని ప్రశ్నించారు.. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం […]

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన

-సానుకూల దృక్పథం ద్వారా ప్రజల్లో ఆనందం ఆంధ్రప్రదేశ్లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని, ఆనందమయ సమాజం ఏర్పాటు కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా ‘చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ శాఖా మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. […]

పాదయాత్రకు జగన్ కసరత్తు

పాదయాత్రకు జగన్ కసరత్తు

నవంబర్ రెండు నుండి జగన్ చేయబోయే పాదయాత్ర కు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇడుపుల పాయ నుండి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర కోసం జగన్ సైతం మానసికంగా సిద్ధం అవుతున్నారు. ఒకటే టార్గెట్..2019 లో అధికార పీఠాన్ని దక్కించు కోవాలనే లక్ష్యం గా పాదయాత్ర కు సిద్ధం అవుతున్న జగన్, అందు […]

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

2019 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించాలనుకుంటున్న సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, సభ్యత్వం నమోదు, ప్లీనరీ సమావేశాలు, పర్యటన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రానున్న ఆరు […]

జగన్ వైపు జయప్రద అడుగులు

జగన్ వైపు జయప్రద అడుగులు

ఉత్తరాది రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు నటీమణి జయప్రద. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన జయప్రద తన సన్నిహితుడు అమర్ సింగ్ తో పాటు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అమర్ స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో […]

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ […]

పిల్లల పాలపై దందా

పిల్లల పాలపై దందా

అంగన్‌వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలకు పాల సరఫరాలో అవినీతి వరద ఏరులై పారుతోంది. ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే రూ.కోట్ల విలువైన వ్యాపారాన్ని అడ్డగోలుగా విజయ డెయిరీకి అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. విజయ డెయిరీ పేరుతో దళారులు రంగ ప్రవేశం చేసి అడ్డగోలుగా […]

రాయలసీమపై టీడీపీ నేతలు గురి

రాయలసీమపై టీడీపీ నేతలు గురి

వైఎస్సార్ సీపీకి పట్టు, పలుకుబడి ఉన్న రాయలసీమలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుండటం నాయకత్వానికి కలవరం కలిగిస్తోంది. గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లోగా వైసీపీకి పెట్టనికోటయిన సీమలో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు టిడిపి నాయకత్వం వ్యూహం అమలుచేస్తోంది. తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న టిడిపి, తన దృష్టినంతా రాయలసీమపైనే […]

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

-రాజధానికి 30 వేల ఎకరాల భూసమీకరణ అపూర్వం -న్యూయార్కు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి డబ్బులేకున్నా తాము మేధస్సు పెట్టుబడిగా ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు సమీకరించి చరిత్ర సృష్టించామని తెలిపారు. […]

అమరవీరుల కుటుంబాలకు అండ : చినరాజప్ప

అమరవీరుల కుటుంబాలకు అండ : చినరాజప్ప

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకంగా పోలీసులు పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. […]

చౌక దుకాణదారులకు పెరగనున్న గౌరవ వేతనం

చౌక దుకాణదారులకు పెరగనున్న గౌరవ వేతనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చౌక దుకాణదారులకు గౌరవ వేతనం కాస్త ఉపశమనం ఇవ్వనుంది. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ షాపులను ‘అన్న విలేజ్‌ మాల్స్‌’ గా మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు చౌకగా సరుకులు అందించాలన్న లక్ష్యం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు […]

కర్నూలు ఎయిర్ పోర్టుకు వడివడగా అడుగులు

కర్నూలు ఎయిర్ పోర్టుకు వడివడగా అడుగులు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత […]

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్

భారత్ లో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిందని, పెట్టుబడులు తీసుకొస్తే పరిశ్రమల స్థాపనకు తనదే భరోసా అని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో, వారెంత సంతోషంగా ఉన్నారోనన్న విషయం ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ను […]