ఆనం బ్రదర్స్ ను పట్టించుకోవడం లేదా..?

నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు. జిల్లా రాజకీయాల్లో ఆనం వర్గం ప్రధానమైంది. ఆనం సోదరులు లేని నెల్లూరు రాజకీయాన్ని ఊహించడం కష్టం. ఎ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి… వీరంతా గతంలో మంత్రులుగా పనిచేశారు. ఆనం వివేకానందరెడ్డి ఓటమెరుగని నేతగా పేరుతెచ్చుకున్నారు. మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, ఛైర్మన్‌గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత ఆయనది. […]