Post Tagged with: "Andhrapradesh"

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు….

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు….

రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీళ్లు లేక జనం గొంతెండుతోంది. రోళ్లు పగులుతున్నాయి. తెలుగురాష్ట్రాలలో రోజుకు సగుటున 20మందికి పైగా సూర్యతాపానికి బలవుతున్నారు. సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే వడగాలులుగా గుర్తిస్తారు. అయితే విపత్తు సహాయ చర్యల విషయంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మాత్రం బాధ్యతరాహిత్యానికి పరాకాష్టగా […]

మళ్లీ పుండుపై కారం జల్లుతున్న కేశినేని

మళ్లీ పుండుపై కారం జల్లుతున్న కేశినేని

బిజెపితో పొత్తుపై ఎవరూ మాట్లాడవద్దు.. కేశినేని నానిని పిలిచి హెచ్చరించండి అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి ఇరవై నాలుగు గంటలు కాకముందే, అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయవాడ ఎంపి కేశినేని నాని మళ్లీ ధిక్కార స్వరం వినిపించారు. బిజెపితో పొత్తు లేకపోతే మరింత మెజారిటీ వచ్చేదన్న తన గత వ్యాఖ్యలకు ఇప్పటికీ […]

ఇష్టారాజ్యంగా మద్యం వ్యాపారులు దందా

ఇష్టారాజ్యంగా మద్యం వ్యాపారులు దందా

మద్యం దందాలో ఆరితేరిన కొందరు మద్యం వ్యాపారులు మద్యం కల్తీనే ప్రధానంగా మార్చుకున్నారనే ప్రచా రం జరుగుతోంది. బ్రాండెడ్ మద్యం సీసాలో తక్కు వ ధర మద్యం కలిపి కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు న్నాయి. ఈ దందా ఎక్కువగా కార్మికులుండే ప్రాంతాలలో సాగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ట్రై సిటీతోపాటు జనగాం, జయశంకర్ భూపాల పల్లి, మహబూబాబాద్ […]

మంచినీరే గరళం

మంచినీరే గరళం

పశ్చిమ కృష్ణాలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటిగా వినియోగించే భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ శాతం పరిమితికి మించి ఉంటోంది. ఎ.కొండూరు మండలంలో సగానికి పైగా గ్రామాల్లో ఫ్లోరైడ్‌ భూతం ప్రజలను పట్టిపీడిస్తోంది. దీంతో యువకులు సైతం ఊతకర్రతో నడవాల్సిన పరిస్థితి వస్తోంది. […]

అమిత్ షా చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలే : సీఎం కేసీఆర్‌

అమిత్ షా చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలే : సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తోన్న భార‌తీయ జ‌నతా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. అమిత్ షా న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌లో చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని అన్నారు. బుధవారం నాడు ముఖ్య‌మంత్రి సీఎం ప్ర‌గ‌తి భ‌వ‌న్ జ‌న‌హిత‌లో మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ దేశంలోనే సంప‌న్న‌మైన రాష్ట్రం తెలంగాణ […]

మెరిట్ సాధించిన విద్యార్ధులను చదివిస్తాను : చంద్రబాబు

మెరిట్ సాధించిన విద్యార్ధులను చదివిస్తాను : చంద్రబాబు

మెరిట్ సాధించిన విద్యార్ధులను చదివించే బాద్యత నాదేనని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. సంపాదనపై కాకుండా సేవ చేయాలనే విషయంపైనే దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. నాణ్యతలేని కాలేజీలు, యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వెలగపూడిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. చిత్తూరు […]

వైకాపావి దిగజారుడు రాజకీయాలు : పరకాల ప్రభాకర్

వైకాపావి దిగజారుడు రాజకీయాలు : పరకాల ప్రభాకర్

భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టింగులపై అయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా ఏజెంట్ల అరెస్టులపై జస్టిస్ కట్జూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాం పరకాల ప్రభాకర్ అన్నారు.  సోషల్ మీడియాలో అసభ్యంగా కార్టూన్ పోస్టులు పెడుతున్న ఇంటూరి […]

వైజాగ్ కు ఫస్ట్, సికింద్రాబాద్ కు సెకండ్

వైజాగ్ కు ఫస్ట్, సికింద్రాబాద్ కు సెకండ్

దేశంలోని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న వాటికి ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాను కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు. స్వచ్ఛ రైల్వే స్టేషన్ల ర్యాంకుల్లో.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ‘ఎ1’ కేటగిరీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ రైల్వే స్టేషన్లు వరసగా 2, 3, 4 […]

ఎండలకు మూగజీవాలు విల విల

ఎండలకు మూగజీవాలు విల విల

మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అడవుల్లో ఉండే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. తరిగిపోతున్న అడవులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు వన్యప్రాణులకు కొత్త కష్టాన్ని తెస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉండే నీటి వనరులు అడుగంటడంతో దాహార్తిని తీర్చుకోవడానికి మైదాన ప్రాంతాల్లోకి పలు వన్యప్రాణాలు వచ్చేస్తూ ఆపదను తెచ్చుకుంటున్నాయి. తాజాగా పాతపట్నం, […]

ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిట్లపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం

ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిట్లపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం

తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్రెడ్డిల సమావేశం ముగిసింది. ఈనెలాఖరులో మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. లారీల కౌంటర్ పర్మిట్లు, ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిట్లపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆర్టీసీ సర్వీసుల విషయంలో రెండు రాష్ట్రాలు అంగీకారానికి రాలేకపోయాయి. ఆర్టీసీ సమస్యలపై చర్చకు ఎండీలు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని […]

నాలుగు వేల కోట్ల అప్పుల క్లబ్ లోకి ఆర్టీసీ

నాలుగు వేల కోట్ల అప్పుల క్లబ్ లోకి ఆర్టీసీ

ఆర్టీసీ సంస్థకు నష్టం తెస్తున్న ప్రైవేటు వాహనాల అక్రమరవాణాపై యాజమాన్యం దృష్టి సారించింది… రాష్ట్రంలో 2,174 ప్రైవేటు బస్సులు, 93 వేల ఆటోలు అక్రమంగా నడుస్తున్నాయని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడి,  నష్టాలు మిగులుతున్నాయి. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిట్లు తీసుకొని స్టేజి క్యారియర్లుగా […]

కాలుష్య కాసారంగా సముద్ర తీర ప్రాంతం

కాలుష్య కాసారంగా సముద్ర తీర ప్రాంతం

అతిపెద్ద సముద్రతీరం కాలుష్యం కాసారంగా మారుతోంది. దీంతో సమీప భవిష్యత్‌లో నవ్యాంధ్ర మత్స్య పరిశ్రమకు గడ్డు రోజులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మత్స్య సంపదను పెంపొందించేందుకు చేయూత ఇవ్వాల్సిన సిఎంఎఫ్‌ఆర్‌ఐ, ఎంపెడా, మత్స్య శాఖలు వౌనం వహించడంతో టన్నులకొద్దీ చేపలు కాలుష్యం బారిన పడి చచ్చిపోయి, సముద్ర జలాలపై తేలియాడుతున్నాయి.శ్రీకాకుళం నుంచి వాడరేవు వరకూ ఉన్న […]

తూర్పులో  సాగు నీటి ఎన్నికల సందడి

తూర్పులో సాగు నీటి ఎన్నికల సందడి

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదేశాలిచ్చింది. నీటి సంఘాల రెండేళ్ల పదవీకాలం దగ్గరపడుతుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్‌ ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 74 నీటి సంఘాలుండగా, గోదావరి మధ్య డెల్టా పరిధిలో […]

ఆ ఇంట పెళ్లికి అనాథలే అతిథులు

ఆ ఇంట పెళ్లికి అనాథలే అతిథులు

ఏ కుటుంబమైన తమ ఇంట్లో వివాహ వేడుక గనుక వస్తే గ్రాండ్ గా జరిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత మండపం నిర్మించి పది కాలాల పాటూ తమ కుటుంబంలో జరిగిన ఈ పెళ్లి సంరంభం గురించి అంతా గొప్పగా చెప్పుకోవాలని భావిస్తుంటారు. అనంతపురంకు చెందిన న్యాయవాది ప్రభాకర్ రెడ్డి సైతం తన కుమార్తె పెళ్లి […]

క్రీడలు..క్రీనీడలు

క్రీడలు..క్రీనీడలు

నెల్లూరును క్రీడారంగానికి చిరునామాగా  మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా స్థానిక క్రీడా సంస్థలో మాత్రం అలసత్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడంలో చూపుతున్న శ్రద్ధ, క్రీడాకారులను ప్రోత్సహించడంలో చూపలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి వెంక్యనాయుడు చొరవతో జిల్లాలో క్రీడా గ్రామానికి శ్రీకారం చుట్టారు. మరెన్నో వసతులు సమకూరినా, సంబంధిత విభాగంలో ప్రగతి లేకపోవడం శోచనీయం. క్రీడాకారులకు అందించాల్సిన […]