Post Tagged with: "Hyderabad"

సాగూ…తోన్న నాలాల సర్వే

సాగూ…తోన్న నాలాల సర్వే

నెలరోజుల క్రితం హైద్రాబాద్ ను వర్షాలు కుదిపేసినపుడు ఎక్కడ మునిగిపోతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో నగరం వరద ముప్పుకు గురయ్యేందుకు నాలాకిరువైపులా, చెరువులోని ఆక్రమణలే ప్రధాన కారణమని గుర్తించిన జిహెచ్‌ఎంసి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల తొలగిస్తూ హల్‌చల్ అంతా ఇంతా కాదు… ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదురుకావటంతో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తొలుత […]

పదిహేను రోజుల్లో సచివాలయాన్ని తరలింపు

పదిహేను రోజుల్లో సచివాలయాన్ని తరలింపు

ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 26న కొత్త క్యాంపు ఆఫీస్ లో అడుగుపెట్టబోతున్నారు. ముహుర్తం కూడా ఖరారు అయింది. ఇక సచివాలయాన్ని కూల్చివేసి.. ఆ వెంటనే కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.. కార్తీకమాసంలోనే కొత్త సెక్రటేరియట్ కు పౌండేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక పదిహేను రోజుల్లో సచివాలయాన్ని తరలించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. […]

ప్రత్యక్ష కార్యచరణకు నడుం బిగిస్తున్న బీజేపీ

ప్రత్యక్ష కార్యచరణకు నడుం బిగిస్తున్న బీజేపీ

తెలంగాణ బీజేపి నేతలు ఎట్టి కేలకు మేల్కొన్నారు… పార్టీకి కొత్త సారధి వచ్చి సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఇంత వరకు నూతన కమిటీలు వేయకపోవడంతో పార్టీ వర్గాలతో పాటు ఇతర పార్టీల నుంచి అనేక విమర్శలు వచ్చాయి.. ముఖ్యంగా డిల్లీకి వెళ్లిన ప్రతి సారి మన నేతలకు ఢిల్లీనేతలు కమిటీ కూర్పు ఎప్పుడంటూ ప్రశ్నిస్తూనే […]

డెంగ్యూ పేరుతో దోచేస్తున్నారు…

డెంగ్యూ పేరుతో దోచేస్తున్నారు…

డెంగ్యూ.. దడ పుట్టిస్తోంది. హైదరాబాద్ లో రోజూ వందల సంఖ్యలో డెంగ్యూ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రికి వస్తున్న వేల మందిలో ఒకటీ, రెండు మాత్రమే డెంగ్యూగా తేలుతున్నాయి. ఈనెలలో వందల మంది ఆస్పత్రిలో అడ్మిట్ అయినా.. 76 మందికి మత్రమే డెంగ్యూ ఉన్నట్లు తేల్చారు వైద్యులు.ఏ ఇంట్లో చూసినా ఒక్కరిద్దరు మంచాన పడి […]

హైద్రాబాద్ ఆదాయంలో ఏపీకి వాట ఇస్తారా…

హైద్రాబాద్ ఆదాయంలో ఏపీకి వాట ఇస్తారా…

తిరుప‌తి వెంక‌న్న ఆదాయంలో 1987 ఎండోమెంట్ యాక్టు ప్రకారం 7 శాతం ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్‌కు, 5 శాతం కామన్ గుడ్ ఫండ్‌, అర్చక సంక్షేమ నిధికి 3 శాతం మొత్తం కలిపి 15 శాతం ఇవ్వాలని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ హైకోర్టులో పిల్ వేయ‌డం కొత్త మ‌లుపు తిరిగింది. […]

నాకు కాంగ్రెస్ లో ఎలాంటి పదవి లేదు…

నాకు కాంగ్రెస్ లో ఎలాంటి పదవి లేదు…

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు, కార్మిక శాఖ మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ త‌న రాజ‌కీయాల గురించి చానాళ్ల త‌ర్వాత క్లారిటీ ఇచ్చేశారు. వాస్త‌వానికి ఆయ‌న చాలా నెల‌లుగా కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ భారీ స్థాయిలో ఉద్య‌మించిన‌ప్పుడు కూడా ఆయ‌న మౌనంగా తెర‌వెనుకే […]

టూరిస్ట్ ల కోసం హైద్రాబాద్ లో ప్రత్యేక హోం స్టే

టూరిస్ట్ ల కోసం హైద్రాబాద్ లో ప్రత్యేక హోం స్టే

పర్యాటకుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ, జిహెచ్‌ఎంసిలు సంయుక్తంగా ‘హోం స్టే’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఈ హోం స్టే విధానం అమలు చేసేందుకు నగరంలో ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన గృహాలను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ గృహాల్లో ఒక రూం నుంచి ఐదు రూంలు కల్గి ఉండి, కనీసం […]

చిక్కు వీడిన ప్రసన్న హత్య కేసు..బాలుడే నిందితుడు

చిక్కు వీడిన ప్రసన్న హత్య కేసు..బాలుడే నిందితుడు

సంచలనం సృష్టించిన మేడ్చల్‌ చిన్నారి హత్య కేసులో ఉత్కంఠ వీడింది. మూడు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ కేసులో చిల్లరదొంగే హంతకుడిగా తేలింది. మేడ్చల్‌ మండలం ఎల్లంపేటలో ఈ నెల 12న మధ్యాహ్నం సమయంలో ఏడేళ్ల సాయిలక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైంది. బ్లేడుతో ఆమె గొంతు, మణికట్టు కోయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన […]

మనస్పర్థలు, అనుమానాలే లక్ష్మీ ప్రసన్న హత్యకు కారణమా..

మనస్పర్థలు, అనుమానాలే లక్ష్మీ ప్రసన్న హత్యకు కారణమా..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన సాయిలక్ష్మీ ప్రసన్న అనే బాలిక హత్య కేసుపై పోలీసులు శాస్త్రీయ కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి చేతిలో ఉన్న వెంట్రుకలు, ఘటనాస్థలం వద్ద లభించిన బ్లేడ్, కత్తెరపై రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. మృతురాలి చేతిలో హంతకుడి వెంట్రుకలు లభించడంతో సమీప […]

శాంతి భద్రతలపై తెలంగాణ మరింత ఫోకస్

శాంతి భద్రతలపై తెలంగాణ మరింత ఫోకస్

రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు క్రైం రేటు కంట్రోల్ చేయడంలో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు తెలంగాణ పోలీసులు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడు పోలీస్ మానిటరింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకి మెరుగైన సేవలందించే అవకాశముందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.గ్రామీణ స్థాయిలో పోలీసింగ్ ను […]

ఆర్టీసీ వజ్ర ఏసీ సర్వీసులు

ఆర్టీసీ వజ్ర ఏసీ సర్వీసులు

ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ప్రయాణికుల దగ్గరకే బస్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వజ్ర పేరుతో దీపావళి నుంచి మిని ఏసీ బస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆర్టీసీ. మొదట విడతగా హైదరాబాద్ టూ […]

హైద్రాబాద్ లో ఒక్క రోజు రో్డ్డు

హైద్రాబాద్ లో ఒక్క రోజు రో్డ్డు

ఇటీవల కురిసిన వర్షాలకు నగర రోడ్లు ఎంతగా ఛిద్రమయ్యాయో ప్రతి వాహనదారుడికి అనుభవమే. అలాంటి రోడ్లలో ఈ చిత్రంలో కనిపిస్తున్నది కూడా ఒకటి. శ్రీనగర్‌ కాలనీలోని సందీప్తి గ్యాస్‌ గోడౌన్‌ నుంచి యూసుఫ్‌గూడ ఆర్‌బీఐ చౌరస్తా వరకు ఉన్న ఈ రోడ్డు మొన్నటి వర్షాలకు పూర్తిగా గుంతలు పడింది. దీంతో అధికారులు ఈనెల 9న అర్ధరాత్రి […]

గ్రేటర్ రోడ్ల మరమ్మత్తులు షురూ…

గ్రేటర్ రోడ్ల మరమ్మత్తులు షురూ…

వర్షాలకు దెబ్బతిని అధ్వానంగా మారిన 180 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రారంభం కానుంది. వీటి కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గతంలో కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన రోడ్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి పకడ్బందగా అడుగులు వేస్తున్నారు. ఇకపై ఇంజినీర్లే మెజర్‌మెంట్ బుక్‌లు నిర్వహించాలని […]

నగరానికి రెండు వేల కోట్ల ఆపిల్స్

నగరానికి రెండు వేల కోట్ల ఆపిల్స్

హైద్రాబాద్ కు విదేశాల నుంచి ఏకంగా వెయ్యి కోట్ల విలువైన యాపిల్స్ దిగుమతి అవుతున్నాయి. అవే కాక దేశీయ వాళీ యాపిల్స్ తో కలపుకుంటే.. రూ. 2 వేల కోట్ల వ్యాపారం జరిగిందని వ్యాపారులు తెలిపారు. విదేశాలలో ప్యాకింగ్ మొదలుకుని పండ్ల నాణ్యత విషయంలో ప్రమాణాలను పాటించడం మూలంగా అవి నాణ్యంగా ఉండి వినియోగదారులు ఎక్కువగా […]

నరక ప్రాయంగా మారిన భాగ్యనగర్ రోడ్లు

నరక ప్రాయంగా మారిన భాగ్యనగర్ రోడ్లు

మహానగరంలోని రోడ్లు ప్రయాణం సాగించే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి. పూర్తిగా గుంతలమయమైన రోడ్లపై ప్రయాణమంటేనే జంతుకున్నారు. వాహనదారులు. అతి భారీ వర్షాలు కురిసిన తర్వాత గత నెల 25వ తేదీ నుంచి వాతావరణం సహకరించటంతో అన్ని మెయిన్‌రోడ్లలో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని, ప్రతిరోజు 1200 గుంతలను పూడ్చాలనే లక్ష్యం పెట్టినట్లు కమిషనర్ […]