Post Tagged with: "India"

2016 హాటెస్ట్ ఇయర్ 

2016 హాటెస్ట్ ఇయర్ 

గడిచిన 100 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 నిలిచింది. మూడు దశాబ్దాల సగటు ఉష్ణోగ్రత కంటే గతేడాది 0.91 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు తెలిపింది భారత వాతావరణ సంస్థ. 13 ఏళ్లుగా భూమి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా 2016 లో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ నమోదైంది.నైరుతి […]

రూ.30వేలకే పాన్ కార్డ్ మస్ట్

రూ.30వేలకే పాన్ కార్డ్ మస్ట్

ఇప్పటివరకు రూ.50వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించాలని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో రూ.30 వేలకు సరిపడే ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపార లావాదేవీలను సైతం ప్రభుత్వం […]

మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్

మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పనిచేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే దాదాపు పక్షం రోజుల పాటు మీడియా కంటికి కనిపించకుండా పోయారు. ఆయనపై రాజకీయ నేతలతో పాటు ఆర్థికవేత్తలు సైతం అనేక […]

మోదీకి ఒబామా కృతజ్ఞతలు

మోదీకి ఒబామా కృతజ్ఞతలు

ఇరు దేశాల మధ్య ఆరోగ్యకర సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామాకు ఇదే చివరి రోజు. ఈ సందర్భంగా ఒబామా మోడీకి ఫోన్ చేసి కొద్ది సేపు మాట్లాడారు. ముఖ్యంగా పౌర అణు ఇంధనం, రక్షణ రంగం, ప్రజల మధ్య […]

జూలై ఒకటి నుంచి జీఎస్టీ బిల్లు

జూలై ఒకటి నుంచి జీఎస్టీ బిల్లు

దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలుపై కేంద్రం, రాష్ర్టాల మధ్య నాలుగు నెలలుగా నలుగుతున్న కోటిన్నర రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థల విభజన అంశం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. కోటిన్నర రూపాయల లోపు టర్నోవర్ కలిగిన సంస్థల్లో 90శాతం, కోటిన్నర పైబడిన టర్నోవర్ కలిగిన సంస్థల్లో 50శాతం రాష్ర్టాల అజమాయిషీలో ఉండేలా అంగీకారం కుదిరింది. జీఎస్టీని జూలై 1వ తేదీ […]

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నిర్వహించనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలకు భారత్ తరఫున 100 మంది హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్, ఏపీ […]

ఎయిర్‌ ఇండియా కుంభకోణంపై విచారణ వేగవంతం

ఎయిర్‌ ఇండియా కుంభకోణంపై విచారణ వేగవంతం

ఐదేళ్ల క్రితం విమానాలకు అవసరమైన సాఫ్ట్ వేర్‌ ను ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేసిన వేళ రూ.225 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించిన సీబీఐ కంప్యూటర్‌ సాఫ్ట్ వేర్‌ సంస్థ ఐబీఎం, జర్మనీకి చెందిన ఎస్‌ఏజీ సహా, ఏఐలోని గుర్తు తెలియని అధికారులపై కేసులు పెట్టింది. ఈ విషయంలో తమ వద్ద ప్రాథమిక […]

నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొటేశారు

నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొటేశారు

నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నమోదైన డిపాజిట్లపై ఆదాయం పన్ను శాఖ దృష్టి పెట్టింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలను ఆ శాఖ సమగ్రంగా విశ్లేషిస్తోంది. ‘బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తంలో మూడునుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల […]

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

పెద్దనోట్ల రద్దు బంగారం పై తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోళ్లు లేక కొద్ది రోజులుగా నేల చూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.330 పెరిగి రూ.29,030కు చేరింది. నగల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా డాలర్‌ […]

ఐటీ అధికారుల దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయం

ఐటీ అధికారుల దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయం

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిక ఆదాయం బయటపడింది. ఇందులో రూ.611.48 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. జప్తు చేసిన నగదులో రూ.114.10 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉన్నాయి. మరోవైపు నవంబర్ 9వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్యలో ఐటీ చట్టం కింద […]

ఓంపురి మరణం వెనుక మోడీ!

ఓంపురి మరణం వెనుక మోడీ!

సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్ కు వెన్నులో వణుకు పుట్టింది. అప్పటి నుంచి మోడీ ఏం చేసిన పాకిస్థాన్ మీడియా ఆయనను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఓంపురి మరణంపై పాకిస్థాన్ మీడియాలో కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఓంపురి మరణం వెనుక ప్రధాని మోడీ, జాతీయ సలహా భద్రతా సలహాదారు […]

ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా…

ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా…

రోజు రోజుకూ జేబులోని పర్సు బరువు మాత్రం తగ్గిపోతోంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల ఎంత వరకూ సాకారం అవుతుందో చెప్పలేం కానీ, ఇప్పటికి మాత్రం ఇది వింతగానూ, విడ్డూరంగానూ కనిపిస్తోంది. నిజానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమనే కల భారతదేశంలాంటి దేశంలో దాదాపు అసంభవం, అసాధ్యమనే […]

డిజిటల్ లావదేవీలకు టోలో ఫ్రీ నెంబర్

డిజిటల్ లావదేవీలకు టోలో ఫ్రీ నెంబర్

డిజిటల్ లావాదేవీల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. టెలికాం రంగ సంస్థలతో కలసి ఐటీశాఖ ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ప్రారంభించింది. భీమ్ యాప్ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సమయంలో కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను 14444 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి.. వినియోగదారులు పరిష్కార […]

మోదీ నిర్ణ‌యంపై ఆ రోజు రిజ‌ల్ట్ వచ్చేస్తుందట

మోదీ నిర్ణ‌యంపై ఆ రోజు రిజ‌ల్ట్ వచ్చేస్తుందట

పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సామాన్యుడు ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోలేని ప‌రిస్థితి. కొత్త క‌రెన్సీ క‌ట్ట‌ల్ని బ్యాంకులోళ్లు న‌ల్ల దొర‌ల‌కు త‌ర‌లించ‌డంలో ఇప్ప‌టికీ పోటీప‌డుతూనే ఉన్నారు. ఈ ఒక్క దెబ్బ‌కు లైఫ్ సెటిలైపోవాల‌న్న ఆలోచ‌న త‌ప్ప బ్యాంకు ఉద్యోగుల్లో ప్ర‌జాసేవా త‌త్ప‌ర‌త క‌నిపించిన పాపాన […]

యూఏఈలో దావూద్‌ ఆస్తుల జప్తు

యూఏఈలో దావూద్‌ ఆస్తుల జప్తు

భారత మోస్ట్‌ వాంటెడ్‌ నేరగాడు, మాఫియా డాన్, ముంబైలో వరుసపేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సర్కారు గట్టి షాకిచ్చింది. యూఏఈలో ఉన్న ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తుచేసింది. జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.15 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా. దావూద్‌కు యూఏఈలో పలు హోటళ్లు, ప్రముఖ కంపెనీల్లో షేర్లు […]