Post Tagged with: "India"

మళ్లీ ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

మళ్లీ ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ ‘నిట్’ ఇంజనీరింగ్ కళాళాల విద్యార్థుల చదువులకు ఆటంకమేర్పడింది. శ్రీనగర్ నిట్ కళాశాలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 5న ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. తర్వాతి ఏడాదికి సంబంధించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఏడాది విద్యా […]

భారీ స్కోరుపై కన్నేసిన భారత్

భారీ స్కోరుపై కన్నేసిన భారత్

ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో […]

భారత్ లో మూడు తలాఖ్‌లకు చోటు లేదు

భారత్ లో మూడు తలాఖ్‌లకు చోటు లేదు

ముస్లిం కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న మూడు తలాఖ్‌ల సంప్రదాయానికి లౌకిక దేశమైన భారత్‌లో చోటు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ముస్లిం కుటుంబాల్లో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఇది కారణం అవుతోందని తెలిపింది. ముస్లిం చట్టాల్లో కుటుంబపరమైన అంశాలకు సంబంధించి ఏమేరకు జోక్యం చేసుకోవాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్న సుప్రీంకోర్టు, ‘ట్రిపుల్ […]

భారత్, పాకిస్తాన్ మధ్య గోడ

భారత్, పాకిస్తాన్ మధ్య గోడ

గోడ అనగానే ఠక్కున గుర్తు వచ్చేది చైనా వాల్. ఇప్పుడు అలాంటిదే ఇండియా కూడా భారీ ప్రణాళికతో రెడీ అవుతుంది. ఇండియా – పాకిస్తాన్ మధ్య గోడ కట్టాలని నిర్ణయానికి వచ్చింది కేంద్రం. చొరబాట్లకు చెక్ పెట్టాలంటే ఇదే పరిష్కారం అని డిసైడ్ అయ్యింది. పాకిస్తాన్ తో సరిహద్దును పంచుకునే జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ […]

భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన ఐఎంఎఫ్

భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన ఐఎంఎఫ్

భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలను మరోసారి ప్రశంసించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇటీవల ఆమోదించిన జీఎస్ టీ బిల్లుపై కూడా పొగడ్తలు  కురిపించింది.  వస్తు సేవల పన్ను అమలు దేశ  మధ్యంతర వృద్ధికి మరింత ప్రోత్సాహాన్ని స్తుందని తెలిపింది. 2016లో దేశం సాధించిన ఆర్థికవృద్ధిని స్వాగతించిన సంస్థ ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని  పేర్కొంది.   […]

చర్చా కార్యక్రమంలో పోసాని వీరంగం

చర్చా కార్యక్రమంలో పోసాని వీరంగం

సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వీరంగం సృష్టించాడు. భారత సైన్యం పాక్ పై జరిగిన సర్జికల్ దాడుల విషయంలో ఆ ఛానల్ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా హాజరయ్యారు. పోసాని నరేంద్రమోడీని ప్రశంసలతో ముంచెత్తాడు. దేశంలో […]

రెండేళ్ల పాటు సరిహద్దులు మూసివేత

రెండేళ్ల పాటు సరిహద్దులు మూసివేత

2018 వరకు భారత్ – పాక్ సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భద్రతపై రాజస్థాన్ లోని జైసల్మీర్ లో బీఎస్ఎఫ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది కేంద్రం. ఈ సమావేశంలో రాజస్థాన్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు, […]

ఉగ్రవాదుల టార్గెట్ ఆ నాలుగు రాష్ట్రాలు

ఉగ్రవాదుల టార్గెట్ ఆ నాలుగు రాష్ట్రాలు

ఇండియా స‌రిహ‌ద్దు రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. ఢిల్లీతోపాటు నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 22 ఎయిర్‌పోర్టులపై ఉగ్రవాదులు దాడి జ‌రిపే ప్రమాదం పొంచి ఉంద‌న్న నేప‌థ్యంలో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు. జ‌మ్ముక‌శ్మీర్‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌ల‌లో హైఅలెర్ట్ ప్ర‌క‌టించారు. ఈ రాష్ట్రాల పోలీస్ చీఫ్‌ల‌కు పౌర విమాన‌యాన శాఖ సెక్యూరిటీ బ్యూరో జాగ్ర‌త్త‌గా […]

శతశాతం దిశగా సాగుతున్న ఆధార్

శతశాతం దిశగా సాగుతున్న ఆధార్

ఏపీలో ఆధార్ కార్డుల నమోదు శతశాతం దిశగా సాగుతోంది. ప్రతి పౌరుడికి గుర్తింపు ఉండేలా ఆధార్ కార్డును ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల్లన్నింటికీ ఈ ఆధార్ ను అనుసంధానం చేశారు. దీంతో పౌరులంతా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు జనంలో కూడా స్పందన ఉండటంతో.. ఇప్పటికే రాష్ర్ట […]

ద్వారకా, సోమనాథ్ ఆలయాల విధ్వంసానికి పాక్ కుట్ర

ద్వారకా, సోమనాథ్ ఆలయాల విధ్వంసానికి పాక్ కుట్ర

ద్వారకా, సోమనాథ్ ఆలయాల విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జవాన్లు సర్జికల్ దాడులు జరిపినందుకు ప్రతీకారం తీర్చుకునేలా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం. ఈ రెండు ప్రధాన ఆలయాలతో పాటు దాదాపు 12 […]

అబ్బే..అంత లేదే…

అబ్బే..అంత లేదే…

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. గత రెండేళ్లుగా ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా రైతులు ఇబ్బంది పడ్డారు. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినడంతోపాటు, సరైన దిగుబడి రాక నష్టపోయారు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే.. అధికారులు మాత్రం లెక్కలతో మాయ చేస్తున్నారు. వృద్ది సూపర్ అంటూ ఊదరగొడుతున్నారు. […]

క్లీన్ స్వీప్ పై కన్నేసిన కోహ్లీ సేన

క్లీన్ స్వీప్ పై కన్నేసిన కోహ్లీ సేన

ఇప్పటికే సిరీస్ గెలిచేశారు.. నంబ‌ర్ వ‌న్ ర్యాంకు సొంత‌మైంది. ఇక మిగిలింది క్లీన్‌స్వీప్ చేయ‌డ‌మే. న్యూజిలాండ్‌తో ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్న మూడో టెస్ట్‌కు కాన్ఫిడెంట్‌గా బ‌రిలోకి దిగుతోంది టీమిండియా. గ‌త నాలుగేళ్లలో మూడో క్లీన్‌స్వీప్‌పై కోహ్లిసేన క‌న్నేసింది. 2012-13లో ఆస్ట్రేలియాను 4-0తో ఓడించిన టీమిండియా.. త‌ర్వాతి ఏడాది వెస్టిండీస్‌ను అలాగే మ‌ట్టి క‌రిపించింది. గ‌తేడాది […]

డిసెంబర్ నాటికి భారత్, పాకిస్థాన్ సరిహద్దులు సీజ్

డిసెంబర్ నాటికి భారత్, పాకిస్థాన్ సరిహద్దులు సీజ్

డిసెంబర్ నాటికి భారత్, పాకిస్థాన్ సరిహద్దులను పూర్తిగా సీజ్ చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జైసల్మేర్ వచ్చిన ఆయన పాక్ తో సరిహద్దులను పంచుకుంటున్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సరిహద్దు భద్రతా దళ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం 200 కిలోమీటర్లకు పైగా […]

పాక్ గడ్డపై విమానాలు దించొద్దు

పాక్ గడ్డపై విమానాలు దించొద్దు

అత్యవసర పరిస్థితుల్లో సైతం పాకిస్థాన్ గడ్డపై విమానాలు దించొద్దని ఇండియన్ ఎయిర్‌లైన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భారత సైనికులు సర్జికల్ దాడులు చేయగా, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకునేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతలానికి సంబంధించి ఆంక్షలు […]

ఆ కూల్ డ్రింక్స్‌ తో అనర్థాలే ఎక్కువ

ఆ కూల్ డ్రింక్స్‌ తో అనర్థాలే ఎక్కువ

కూల్ డ్రింక్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి అనర్థాలే ఎక్కువని పరిశోధనలో వెల్లడైంది. తాజాగా పెప్సికో, కోకాకోలా వంటి సంస్థలు తయారు చేసే సాఫ్ట్ డ్రింకుల్లో విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం నిర్వహించిన పరిశీలనలో తేలింది. తమ పెట్‌బాటిల్స్‌లో అలాంటివి ఏమీ లేవని రెండు కంపెనీలు ఖండించాయి. తమకు ప్రభుత్వం నుంచి అలాంటి నివేదిక ఏదీ రాలేదంటున్నాయి. […]