Post Tagged with: "Tamilnadu"

జయ ఆరోగ్యం కోసం స్టాలిన్‌ ప్రార్ధన

జయ ఆరోగ్యం కోసం స్టాలిన్‌ ప్రార్ధన

అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై అపోలో ఆస్పత్రికి శనివారం రాత్రి వచ్చారు. ఆయనకు జయలలితను చూసే అవకాశం దక్కలేదు. సీనియర్ నేత దురైమురుగన్‌తో కలిసి ఆస్పత్రికి వచ్చిన స్టాలిన్‌ను మంత్రి ఓ పన్నీర్ సెల్వం, […]

అమ్మ కోలుకుంటోంది…

అమ్మ కోలుకుంటోంది…

తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానశాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్) నుంచి గుండె, ఊపిరితిత్తులు, అనెస్తీషియా నిపుణులను చెన్నైకి పంపించడంతో ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. ముఖ్యమంత్రి బాగానే ఉన్నారని, ఇప్పుడు ఆమెకు బదులు మరొకరిని తాత్కాలికంగా నియమించాల్సిన […]

జయ మాజీ దత్త పుత్రుడికీ నో ఎంట్రీ

జయ మాజీ దత్త పుత్రుడికీ నో ఎంట్రీ

పురుచ్చి తలైవి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆనారోగ్యంతో రెండు వారాలుగా ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రముఖులకు తప్ప జయను చూసే అవకాశం ఎవరికీ తమిళనాడు ప్రభుత్వం కల్పించడం లేదు. గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో జయకు ఇంకా చికిత్స కొనసాగుతోందని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జయ ఊపిరి తిత్తులకు […]

తెరపైకి అమ్మ వారసుడి పేరు…

తెరపైకి అమ్మ వారసుడి పేరు…

రెండు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటుంది తమిళనాడు సీఎం జయలలిత. లండన్ నుంచి వైద్య బృందం, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా డాక్టర్లు దగ్గరుండి జయకు చికిత్స చేస్తున్నారు. మరింత మైరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తరలించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అమ్మ తర్వాత ప్రభుత్వానికి, పార్టీకి మార్గనిర్దేశం చేసిది ఎవరు […]

జయను పరామర్శించేందుకు వెళ్ళిన రాహుల్ గాంధీకి నిరాశ

జయను పరామర్శించేందుకు వెళ్ళిన రాహుల్ గాంధీకి నిరాశ

16 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్లినా అధికారులు అంగీకరించలేదు. ఆమెను చూసేందుకు వీల్లేదని స్పష్టం చేయడంతో ఆమె […]

జయ నిచ్చెలి శశికళతో పన్నీర్ సెల్వం సమావేశం

జయ నిచ్చెలి శశికళతో పన్నీర్ సెల్వం సమావేశం

రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ ఉదయం ఆసుపత్రికి వచ్చారు. పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన మరో ఇద్దరు మంత్రులతో కలసి […]

ఆస్పత్రిలో ఉన్నా ప్రజా సంక్షేమంపై జయ బెంగ

ఆస్పత్రిలో ఉన్నా ప్రజా సంక్షేమంపై జయ బెంగ

ప్రస్తుతం జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంలోనూ ప్రజా సంక్షేమాన్ని వదల్లేదు. కావేరీ నీటి విషయంలో వివాదం తీవ్రమవుతున్న వేళ ఆసుపత్రి బెడ్ పై నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా, దానికి తన బదులుగా ప్రజా పన్నుల శాఖ మంత్రి […]

మరిన్ని కష్టాల్లో శశికళ

మరిన్ని కష్టాల్లో శశికళ

అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ సారి ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా కోర్టునే బురిడీ కొట్టించే యత్నం చేశారంటూ కేసు నమోదు కావడం గమనార్హం. అమ్మ జయలలిత ఆజ్ఞల్ని ధిక్కరించి రాజ్యసభ పదవిలో శశికళ పుష్ప కొనసాగుతున్నారు. అమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించే పనిలో పడ్డ శశికళ […]

సినిమాల్లో అవకాశాల పేరుతో వ్యభిచారంలోకి..

సినిమాల్లో అవకాశాల పేరుతో వ్యభిచారంలోకి..

సినిమాల్లో అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో చాన్స్‌ల పేరుతో మహిళలను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు కాంచీపురం జిల్లా మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. మధురవాయల్‌లోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం […]

జయకు అస్వస్థత

జయకు అస్వస్థత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమెను గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. […]

మళ్ళీ నెట్లో శశికళ పుష్ప, తిరుచ్చి శివ సన్నిహిత ఫొటోలు

మళ్ళీ నెట్లో శశికళ పుష్ప, తిరుచ్చి శివ సన్నిహిత ఫొటోలు

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప డీఎంకే నేత తిరుచ్చి శివతో సన్నిహితంగా ఉన్న కొత్త ఫొటోలు ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదలై సోషల్ మీడియాలో వైరలైన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అవి మార్ఫింగ్ ఫొటోలని పుష్ప శశికళ వివరణ ఇచ్చి చేతులు […]

తమిళనాడులో కొనసాగుతున్న బంద్

తమిళనాడులో కొనసాగుతున్న బంద్

కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని కన్నడ ప్రజలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనలు చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. తమిళులను కొట్టి గాయపరిచారు. ఈ చర్యలకు నిరసనగా శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు […]

విందుకోసం 25 మేక‌లు, 100 కోళ్లు బలిచ్చిన మహిళా ఎమ్మెల్యే

విందుకోసం 25 మేక‌లు, 100 కోళ్లు బలిచ్చిన మహిళా ఎమ్మెల్యే

త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే త‌ర‌పున గెలుపొందిన ప‌ర‌మేశ్వ‌రి ఓ ప్రఖ్యాత దేవాలయంలో పార్టీ ఇచ్చారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేట‌ర్లు హాజరయ్యారు. ఈ విందు కోసం స‌ట్టిక‌రుప్పు అమ్మ‌వారి పేరుతో 25 మేక‌లు బ‌ల‌య్యాయి. 100 కోళ్లు బలిచ్చారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. ఈనోటా […]

ప్రాణాంతక వ్యాధులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం….

ప్రాణాంతక వ్యాధులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం….

చెన్నై లో అత్యాధునిక సదుపాయాలతో 600 మంది పిల్లలకి సరిపడ డాక్టర్లు గల హాస్పిటల్ ఉంది. అక్కడ అందించే వైద్యం పూర్తిగా ఉచితం. ఈ హాస్పిటల్ లో నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే…అంటే 10 లక్షల రూ. ల వరకు ఖర్చు కాగల గుండె సంబంధిత వ్యాధులైనా […]

నీటికోసం దాడులకు తెగబడడం దారుణం : ప్రకాష్ రాజ్

నీటికోసం దాడులకు తెగబడడం దారుణం : ప్రకాష్ రాజ్

నీటి కోసం మనుషులపై దాడులకు తెగబడడం దారుణమని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కావేరీ జల వివాదంతో రెండు రాష్ట్రాల్లో విధ్వంసంపై ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. నీరు అవసరాలు తీరుస్తుందని, వాటి కోసం ప్రాణాలు తీసుకోవడం అనాగరికమని సూచించాడు. ఇంతా చేసి మనం హింసిస్తున్నది ఎవరిని? […]