Post Tagged with: "TDP"

ప్రివిలేజ్ కమిటీ

ప్రివిలేజ్ కమిటీ

అసెంబ్లీ సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి నోటీసులు అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలైంది. ఇవాల్టి విచారణకు ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉండగా, నలుగురే వచ్చారు. కొడాలినాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాలేదు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ శాసనసభ సమావేశాల్లో బెంచీలు ఎక్కి స్పీకర్‌పైకి కాగితాలు విసిరి, స్పీకర్ టేబుల్‌పైన […]

మోత్కుపల్లికి కలిసి రాని కాలం

మోత్కుపల్లికి కలిసి రాని కాలం

రాజ్య‌స‌భ సీట్ల‌ను భ‌ర్తీ చేసే స‌మ‌యంలో తెలంగాణ నుంచి సీనియ‌ర్ నేత‌గా ఉన్న మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌ల నుంచి తీవ్ర పోటీ నెల‌కొంది. అయితే ప‌లు కార‌ణాల రీత్యా మోత్కుప‌ల్లికి స‌ర్దిచెప్పిన పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు… భ‌విష్య‌త్తులో గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ ఆయ‌న‌కు హామీ ఇచ్చారు. దీంతో నాడు రాజ్య‌స‌భ […]

ఎమ్మెల్సీ బీజేపీకి….మేయర్ కు టీడీపీ

ఎమ్మెల్సీ బీజేపీకి….మేయర్ కు టీడీపీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో.. జీవీఎంసీ మేయర్ పీఠంపై మిత్రపక్షమైన బీజేపీతో పడిన పీటముడిని విప్పాలని టీడీపీ యత్నిస్తోంది. ఈ రెండు ఎన్నికలు దాదాపు ఒకేసారి జరిగే అవకాశాలుండడంతో అధికార పార్టీ ఈ ఎత్తు వేస్తోంది.ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మేయర్ పీఠాన్ని తమకే ఉంచుకోవాలన్న ఎత్తుగడను టీడీపీ పెద్దలు తెరపైకి తీసుకొచ్చారు.జీవీఎంసీ ఎన్నికల విషయంలో ఇన్నాళ్లూ […]

ఒంగోలు ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కోసం కసరత్తు

ఒంగోలు ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కోసం కసరత్తు

పట్ట భద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి టిడిపి నుండి పోటీచేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వచ్చినా ఆర్థికంగా స్తోమతలేని నాయకులు వచ్చే పరిస్థితి ఉండటంతో జిల్లాకు పక్కజిల్లా నెల్లూరు నుండి ఆర్థికంగా బలోపేతంగా ఉన్న నేతను రంగంలోకి దించేందుకు తెలుగుతమ్ముళ్లు ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నారు. అందులోభాగంగానే జిల్లా […]

టీడీపీలో చర్చకు తెరలేపిన గ్రేడ్స్..

టీడీపీలో చర్చకు తెరలేపిన గ్రేడ్స్..

ఇటీవల టీడీపీ నేతలకు పార్టీ హైకమాండ్ ఇచ్చిన గ్రేడ్లు విషయంలో టెన్షన్ లేదు గానీ, అందులోవారిపై ఆరోపణలు చేస్తూ.. ఉన్న సమాచారంపై అందోళన చెందుతున్నారు. చాలామంది తాము అధిష్టానం దృష్టిలో ఎక్కడ డ్యామేజ్ అవుతామోనని భయపడి.. నివారణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇసుక దందా, అక్రమతవ్వకాలు , అవినీతి దందాలల్లో ప్రమేయం ఉన్న నేతలు ఆందోళన […]

నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన ప్రభుత్వం

నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన ప్రభుత్వం

ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, లేనిపక్షంలో రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టిడిపి ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసింది. కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. నిరుద్యోగ భృతి హామీ గురించి ఆయనను ప్రశ్నించినప్పుడు అది సాధ్యం కాదని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే […]

నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?

నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?

ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి సూక్తులు చెప్పడం మాని ఆయన అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడాలని పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. బుగ్గన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ రూ.500, రూ.1,000 నోట్ల ముద్రణ నిలిపివేయాలని చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు చెబుతున్నారు? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి […]

టీడీపీకి బీజేపీ షాక్

టీడీపీకి బీజేపీ షాక్

మైత్రిధర్మం పాటించని టీడీపీ వైఖరిపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న బీజేపీ గుంటూరు నేతలు చివరికి పెద్ద షాకే ఇచ్చారు. త్వరలో జరగబోయే గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ హఠాత్‌ పరిణామంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఆలోచనలో పడటంతో గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిన్నపాటి నామినేటెడ్‌ పదవి […]

ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి : ముద్దు

ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి : ముద్దు

టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల్లో ఒక దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన గాలి ముద్దుకృష్ణమ గతంలో ప్రజలకు మెరుగైన పాలన కోసం 1987లో […]

వైసీపీ నేతలను ఆలోచనల్లో పడేసిన దేవినేని

వైసీపీ నేతలను ఆలోచనల్లో పడేసిన దేవినేని

టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన దేవినేని నెహ్రు…వైసీపీ నేతలకు మంచి షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా రాష్ట్ర విభ‌జ‌న‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అధోఃపాతాళానికి ప‌డిపోయిన వేళ‌… ఆయ‌న త‌న కొడుకు దేవినేని అవినాశ్ తో క‌లిసి త‌న సొంత గూటికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన దేవినేని […]

లోకేష్ గారు.. ఇదేనా మీ సభ్యత, సంస్కారం!

లోకేష్ గారు.. ఇదేనా మీ సభ్యత, సంస్కారం!

‘విలువల వ్యవస్థ, మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన గొప్ప లక్షణాల గురించి అనర్గళంగా లెక్చర్లు దంచటం ఆపండి! తమరి ప్రవర్తన తాలూకు మచ్చుకు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నాం.. వాటికి సమాధానం ఇవ్వండి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ‘మీరు వీటికి సమాధానమిస్తే మీ విలువలు, […]

ప్రభుత్వ వైఫల్యాలపైనే వైఎస్సార్ కాంగ్రెస్ ఆశలు

ప్రభుత్వ వైఫల్యాలపైనే వైఎస్సార్ కాంగ్రెస్ ఆశలు

ప్ర‌స్తుత ట్రెండ్‌లో పాలిటిక్స్‌లో నెగ్గుకు రావ‌డం అంత తేలిక‌కాదు. ఎదుటి వాడి లోని లోపాల‌ను, వాళ్ల ఫెయిల్యూర్స్‌ను మ‌న విజ‌యంగా, మ‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్న నాడే విప‌క్షాలు విజ‌యం సాధించేందుకు అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ఈ ఫార్ములానే ఓన్ చేసుకునేందుకు వెంప‌ర్లాడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చెప్పుకోడానికి త‌మ ద‌గ్గ‌ర ఏమీ లేన‌ప్పుడు.. ఎదుటి […]

జగన్ కు కలిసి రాని కాలం

జగన్ కు కలిసి రాని కాలం

రెండున్నరేళ్ల నుంచి టీడీపీ ,ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మధ్య జరుగుతున్న మాటల, మానసిక యుద్ధం వ్యక్తిగత దూషణల స్థాయి దాటిపోతున్నాయి. తాజాగా ముగిసిన టీడీపీ శిక్షణ శిబిరాల్లో లోకేశ్-చినరాజప్ప ఫొటో ఆధారంగా వైసీపీ చేసిన రచ్చ చివరకు ఆ పార్టీ పరువుపోగొట్టింది. దీనిపై పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వ్యూహం పార్టీఇమేజ్‌ను పోగొట్టేలా ఉందన్న ఆవేదన వైసీపీ […]

ఆ ఫొటో తొలగించిన లోకేష్

ఆ ఫొటో తొలగించిన లోకేష్

టీడీపీ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వ్యవహర శైలిపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పించారు. వేదికపై ఉన్న లోకేష్ సభికుల్లో ముందు వరుసలో కూర్చున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్పను ప్రశ్నిస్తున్నట్టున్న ఫొటోపై నెటిజన్లు సెటైర్లు వదిలారు. దీంతో సదరు చిత్రాన్ని లోకేష్ తన ఫోస్బుక్ ఖాతా నుంచి తొలగించారు. టీడీపీ శిక్షణ […]

లోకేష్ ఆంధ్రా నయీం : గౌతంరెడ్డి

లోకేష్ ఆంధ్రా నయీం : గౌతంరెడ్డి

ఏపీ అధికార పార్టీ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌పై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. తెలుగు దేశం యువనేతకు డబ్బుపై వ్యామోహం పెరిగిపోయిందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లోకేష్ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. వైసీపీకే చెందిన గౌతం రెడ్డి కూడా లోకేష్‌పై ధ్వజమెత్తారు. లోకేష్ […]