Post Tagged with: "Telangana"

కేసీఆర్ పై కోదండ బాంబ్

కేసీఆర్ పై కోదండ బాంబ్

తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మెడ‌కు కోదండ‌రామ్ అనే గుదిబండ త‌గులుకుంది. ఇది వ‌ద‌ల‌దు.. వెళ్ల‌నివ్వ‌దు. నిజాయితీ, చిత్త‌శుద్ధి, ప్ర‌జా సేవ‌కు మారు పేరు ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్. అందుకే ఆయ‌న‌కు జ‌నాల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం చేప‌ట్టే దేన్న‌యినా ఆయ‌న […]

రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేసిన కేటీఆర్

రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేసిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ – రేవంత్ రెడ్డి మధ్య చర్చ ఆసక్తికరంగా మారింది. ఒకానొక దశలో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విసిరిన సెటైర్లకు సభలో నవ్వులు విరిశాయి. తన ప్రసంగానికి అడ్డుతగులుతున్న రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ‘అధ్యక్షా చిలక మనదే గానీ.. పలుకులు మాత్రం పరాయివి’ అని […]

మరింత దూకుడుగా టీ కాంగ్రెస్ 

మరింత దూకుడుగా టీ కాంగ్రెస్ 

అసెంబ్లీలో ప్రజా స‌మ‌స్య‌లపై గ‌ళ‌మెత్తాం….మేం అడ‌గాల్సింది అడిగాం…..ప్రభుత్వాన్ని క‌డిగిపారేశాం….ప్రధాన ప్రతిప‌క్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాం….వ‌చ్చే స‌మావేశాల వ‌ర‌కు ప్రభుత్వం త‌న పాత్ర నిర్వర్తించ‌క‌పోతే ప్రధాన ప్రతిప‌క్షంగా మ‌రింత దూకుడుగా వెళ్తామంటోంది కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం. ఇక సమావేశాల్లో ప్రదాన ప్రతిప‌క్షంగా నిర్మాణాత్మాకంగా వ్యవ‌హరించామ‌న్న హ‌స్తం పార్టీ…తాము స‌హ‌క‌రించ‌కపోతే స‌భ స‌జావుగా న‌డిచేది కాద‌ని చెప్పుకొచ్చింది..అసెంబ్లీ శీతాకాల […]

మెట్రో ఫీడర్లలలో బస్సులు, ఎలక్ట్రిక్ వాహానాలు

మెట్రో ఫీడర్లలలో బస్సులు, ఎలక్ట్రిక్ వాహానాలు

మెట్రోరైలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మూడు కారిడార్లుగా కొనసాగుతున్న మెట్రోరైలు పనుల్లో భాగంగా నాగోల్ నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్ల మార్గాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకు సర్వీసు రోడ్లను, సమీపంలో ఉన్న కాలనీలు, ప్రభుత్వా కార్యాలయాల నుంచి ప్రయాణికులను తీసుకువచ్చేందుకు వీలుగా ఫీడర్ బస్సులు, విద్యుత్ వాహనాలను అందుబాటులోకి […]

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం వర్తించదు…

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం వర్తించదు…

ఇదేదో సరదా కామెంట్ అనుకుంటున్నారా…. అధికార పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తూన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పార్టీ ఫిరాయింపుల చట్టం నవ్వులపాలవుతున్నట్లు స్పష్టవౌతోంది. ప్రస్తుతం ఏ క్షణాన ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పక్షంలోకి జంప్ చేస్తారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో […]

AIADMK General Secretary Sasikala Natarajan.(File Photo: IANS)

శశికళపై అన్నాడీఎంకే రెబల్స్ తిరుగుబాటు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా ఇంటికే పరిమితమైన శశికళ ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో కల్పించుకోవడాన్ని అన్నాడీఎంకే ప్రజాప్రతినిధులకు మింగుడుపడడం లేదు. రోజురోజుకూ వారిలో తిరుగుబాటు ధోరణి ఎక్కువవుతోంది. ఈ క్రమంలో వారు ప్రత్యామ్నాయంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పంచన చేరుతున్నారు. ఆమె నాయకత్వంలో శశికళపై తిరుగుబాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సమయం వచ్చినప్పుడు […]

2019 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్

2019 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్

2019 ఎన్నికల్లో కేసీఆర్ తన స్థానాన్ని తన తనయుడు కేటీఆర్ కి అప్పజెప్పబోతున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. భోగి పండగ రోజున ప్రగతి భవన్ లో జరిగిన తెలంగాణ సీఎం రివ్యూ మీటింగ్ ఈ విషయంలో కొన్ని సంకేతాలను ఇచ్చింది. మంత్రివర్గ పనితీరు మీద ఆయన జరిపిన రివ్యూలో కేటీఆర్ పనిచేసే పరిశ్రమల శాఖకే […]

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్టీసీకి ఆదాయం అదనంగా వచ్చింది. రైల్వే శాఖకు ఆదాయం పది శాతం పెరిగింది. పండుగ సెలవులకు ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు సొంత ఊళ్లకు రావడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించడంతో 7 రోజుల్లో ఒక రోజు […]

రేపటి నుంచి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 30కే ముగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్ ఒకవైపు, ప్రవేశపెట్టాల్సిన బిల్లు మరోవైపు ఉండడంతో జనవరి 3 నుంచి 6 వరకు కొనసాగించారు. ఈ కొనసాగింపు సమావేశాల్లో పాల్గొనబోమని కాంగ్రెస్, తెలుగుదేశం ప్రకటిస్తూనే […]

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నిర్వహించనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలకు భారత్ తరఫున 100 మంది హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్, ఏపీ […]

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

హైదరాబాద్ ప్రజల కల త్వరలో సాకారం కానుంది. జూన్ 2 న ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాల ను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు స్కైవాక్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎస్సిటీ జనం డ్రీమ్ ప్రాజెక్టు మెట్ర్ రైల్ ప్రారంభానికి ఏర్పాట్లు […]

కలర్ ఫుల్ గా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

కలర్ ఫుల్ గా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. వివిధ దేశాలకు చెందిన కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కలర్ ఫుల్ గా సాగిన ప్రోగ్రామ్స్ తో సిటీ జనం పులకించిపోయారుకళలు సరిహద్దులను చెరిపేసి మానవ సంబంధాలను పెంపొందిస్తాయని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. శిల్పకళావేదికలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ […]

సంక్రాంతి సందడితో పల్లెలు

సంక్రాంతి సందడితో పల్లెలు

సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. రైతులు ఏడాది పాటు శ్రమించి పంటలు పండించి చేతికివచ్చిన పంటలు,నగదుతో గోవులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. పితృదేవతలకు తర్పణాలు పెడతారు. పిల్లలు ఎంతో సంతోషంగా గాలి పటాలు ఎగరవేస్తారు. […]

ఆ గవర్నర్ మాకొద్దు..!

ఆ గవర్నర్ మాకొద్దు..!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇరు రాష్ట్రాల‌కు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్లు అవ‌స‌ర‌మ‌ని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. కర్ణాటకకు చెందిన శంకరమూర్తి నరసింహన్ స్థానంలోకి వస్తార‌ని ప్రచారం సాగుతోంది. ఆయ‌న […]

హైద్రాబాద్ లో ఏపీ రిజిస్ట్రేషన్ వాహానాలు లక్ష

హైద్రాబాద్ లో ఏపీ రిజిస్ట్రేషన్ వాహానాలు లక్ష

జూన్ 2, 2014కు ముందు ఉన్న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ల‌ను మార్చుకునేందుకు వీలుగా రాష్ట్ర ర‌వాణా శాఖ ఆన్‌లైన్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌క‌ముందు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ ఏపీ పేరుతో వ‌చ్చాయి. ఇప్పుడు టీఎస్ పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాల‌ని ర‌వాణాశాఖ స్ప‌ష్టం చేసింది. ఏపీ రిజిస్ట్రేష‌న్‌తో ఉన్న నంబ‌ర్ ప్లేట్ల‌ను మార్చుకోవాల‌ని ప్ర‌భుత్వం […]