Post Tagged with: "Tirupati"

తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్ ప్రెస్ రైలు

తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్ ప్రెస్ రైలు

తిరుపతి యార్డు లైన్ లో రెండునెలల వ్యవధిలో మరో రైలు పట్టాలు తప్పింది. జనవరిలో రాయలసీమ ఎక్స్ ప్రెస్, వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ లు పట్టాలు తప్పిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి కరీంనగర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. […]

వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల

వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల

నిత్యమూ సాధారణ భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు నేడు వీఐపీలతో నిండిపోయాయి. ఈ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి వారిని సందర్శించుకున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, పనబాకలక్ష్మి, టీటీడీ బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు, సినీ ప్రముఖులు […]

సమ్మర్ తో జరా భద్రం అంటున్న పోలీసులు

సమ్మర్ తో జరా భద్రం అంటున్న పోలీసులు

  వేసవిలో తీర్థ యాత్రలకు, విహార యాత్రలకు, ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆరుబయట, మిద్దెలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి.ఇంటి కిటికీలను మూసివేయాలి. […]

29న తిరుపతిలో ఉగాది..

29న తిరుపతిలో ఉగాది..

హేమ లంబనామ తెలుగు ఉగాది సంవత్సర సంబరాలను ఈనెల 29న స్థానిక మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఈనెల 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు మంగళ ధ్వనితో ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి.అనంతరం వేద స్వస్తి, ప్రముఖ పండితులతో పంచాంగ శ్రవణం, కవులతో అష్టావధానం నిర్వహిస్తామన్నారు.ఉద్యోగుల పిల్లలకు సాంప్రదాయ వస్తధ్రారణ పోటీల, ఉద్యోగులకు […]

శ్రీసిటీలో ‘నిట్సు లాజిస్టిక్‌’ పరిశ్రమకు శ్రీకారం

శ్రీసిటీలో ‘నిట్సు లాజిస్టిక్‌’ పరిశ్రమకు శ్రీకారం

జపాన్‌కు చెందిన నిపాన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూపునకు చెందిన నిట్సు లాజిస్టిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ నూతన గిడ్డంగి కేంద్రానికి బుధవారం శ్రీసిటీలో ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నిపాన్‌ గ్రూపు సంస్థల పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులకు, నిట్సు లాజిస్టిక్‌ ప్రతినిధులకు, ఇతర సీనియర్‌ అధికారులకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టరు రవీంద్రసన్నారెడ్డి స్వాగతం పలికారు. ఈ […]

ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల్లో బాదుడు

ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల్లో బాదుడు

  పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తం అయిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికీ సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులు లావాదేవీల చార్జీలు భారీగా పెంచుతున్నాయి. సామాన్యులకు అండగా నిలిచి    ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవా ల్సిన బ్యాంకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటే ఖాతాదారులు భయపడిపోతున్నారు. జిల్లాలో సుమా రు 42 లక్షల జనాభా ఉంది. […]

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

  వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రభుత్వాదీనంలోని అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి    కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.   అటవీప్రాంతంలో తిరుమలలో నాలుగు, తిరుపతలో నాలుగు వాచ్ టవర్లు ఏర్పాటుచేశామని, ఇక్కడ సిబ్బంది 24    గంటల పాటు అప్రమత్తంగా […]

వెంకన్నకు కుమార్తె తలనీలాలు సమర్పించిన బన్నీ

వెంకన్నకు కుమార్తె తలనీలాలు సమర్పించిన బన్నీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాడు. తన కుమార్తె తలనీలాలను స్వామి వారికి సమర్పించాడు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించు కున్నాడు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. తన భార్య స్నేహ, కుమారుడు, తన తల్లిదండ్రులతో కలసి […]

తిరుమలలో స్వూన్ ఫ్టూ అలర్ట్

తిరుమలలో స్వూన్ ఫ్టూ అలర్ట్

  రాష్ట్రవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతండటంతో తిరుమలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. నిత్యం వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వస్తుంటారు. వ్యాధి లక్షణాలున్న వారు  వచ్చిన పక్షంలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి   స్వైన్ ఫ్యూ వ్యాపించే అవకాశం ఉంటుంది. గతంలో స్వైన్ ఫ్యూ వ్యాధి వ్యాప్తి […]

రథసప్తమికి భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం

రథసప్తమికి భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే నూతన సంవత్సర పంచాంగాన్ని ఫిబ్రవరి 3వ తేదీ రథసప్తమి పర్వదినానికి అన్ని తితిదే ప్రచురణల విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులో ఉంచాలని తితిదే కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం ఈవో తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌తో కలిసి సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం […]

తిరుమలలో ఫిబ్రవరి 20న ధార్మిక సదస్సు 

తిరుమలలో ఫిబ్రవరి 20న ధార్మిక సదస్సు 

ప్రపంచంలోనే అత్యంత సనాతనమైన హైందవ ధర్మానికి దశ, దిశ నిర్దేశించేందుకు, భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఫిబ్రవరి 20వ తేదీ తిరుమలలోని ఆస్థాన మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలోని సోమవారం ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, […]

కన్యాకుమారి, ఢిల్లీలో శ్రీవారి ఆలయాలు

కన్యాకుమారి, ఢిల్లీలో శ్రీవారి ఆలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీ సమీపంలో (హర్యానా రాష్ట్ర పరిధి) రూ.55 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. కొన్ని కారణాల వల్ల చాలామంది తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండదని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. […]

వినియోగంలోకి అన్నమయ్య మార్గం

వినియోగంలోకి అన్నమయ్య మార్గం

తిరుమలకు భక్తులు చేరుకునేందుకు వీలుగా గతంలో ఏర్పాటుచేసిన అన్నమయ్య మార్గం పూర్తిగా వినియోగంలోకి తేవడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆలయం దక్షణ మాడ వీధిలో కదిలేవంతెన మార్గం (క్యూలైన్), ఆలయం లోపల ఉన్న ప్రసాద వితరణ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దాటిన తరువాత మోకాళ్ళ మెట్లు మధ్య ఉన్న రోడ్డు […]

తిరుమలలో నీటి కష్టాలు

తిరుమలలో నీటి కష్టాలు

తిరుమలలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకూ డ్యాముల్లో నీరు పుష్కలంగా ఉండటంతో తిరుమలలో నీటి కష్టాలు ఎదురవ్వలేదు. అయితే తాజాగా నైరుతీ రుతుపవనాలు తిరుమలకి ఇవ్వాల్సినంత వర్షాన్ని ఇవ్వకపోవడం….ఈశాన్య బుతుపవనాలు తిరుమల వైపే చూడకపోవడంతో తిరుమలకి నీటి ఇక్కట్లు తప్పేలా కనబడ్డం లేదు. తిరుమలలో ఉన్నఅన్ని డ్యాముల్లోని నీటి మట్టం  కనిష్ట స్ధాయికి […]

తిరుపతి పార్కులలో కామకేళి

తిరుపతి పార్కులలో కామకేళి

ఆధ్యాత్మిక నగరం అల్లరిమూకలు, కామాంధులతో నిండిపోయింది. కుటుంబంతో కలిసి వారాంతంలో హాయిగా గడపాల్సిన పార్కులు ప్రేమజంటలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పార్కుల్లో ఉండే చెట్ల మాటున కామాంధులు రెచ్చిపోతున్నారు. తిరుపతి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరంగా గుర్తింపు ఉంది. ఎటు చూసినా దేవాలయాలు, అందులో జరిగే పూజలు, పునస్కారాలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న […]