Post Tagged with: "vijayawada"

బెజవాడ ఆర్టీఏ ఆఫీసు ముందు కేశినేని నాని అందోళన

బెజవాడ ఆర్టీఏ ఆఫీసు ముందు కేశినేని నాని అందోళన

బందరు రోడ్ లోని ఆర్టీ కార్యాలయం ఎదుట శనివారం నాడు ఎంపీ కేశినేని నాని ఆందోళనకు దిగారు. ప్రవేట్ బస్సులతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ రవాణాశాఖ కార్యాలయంలో బైఠాయించి అధికారులతో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. […]

రైల్వే స్టేషన్లలో డిజిపే ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు

రైల్వే స్టేషన్లలో డిజిపే ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 10 రైల్వే స్టేషన్లలో  డిజిటల్ పే సౌకర్యాన్ని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు  రిమోర్ట్ తో ప్రారంభించారు. స్థానికంగా విజయవాడ స్టేషన్ లో డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజమండ్రి స్టేషన్ ని కూడా త్వరలొ పూర్తిస్దాయిలో డిజిటల్ స్డేషన్ […]

హైద్రాబాద్ ని మించి పోతున్న బెజవాడ అద్దెలు

హైద్రాబాద్ ని మించి పోతున్న బెజవాడ అద్దెలు

విజయవాడ నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో జనసంఖ్య పెరగడంతో అద్దెల బాదుడు ఎక్కువైంది. యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు పెంచేస్తున్నారు. గతంలో 2వేలు ఉన్న అద్దె ధర ఇప్పుడు ఏకంగా 5 వేలకు చేరిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే…. హైదరాబాద్‌లో కూడా లేని అద్దె […]

30న బెజవాడ బార్ ఎలక్షన్స్

30న బెజవాడ బార్ ఎలక్షన్స్

బెజవాబార్ అసోసియేషన్ సాధారణ ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియడంతో ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం.. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. దీంతో బరిలో నిలుస్తున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. […]

లీకు వీరులపై చర్యలేవీ…

లీకు వీరులపై చర్యలేవీ…

 రాష్ట్రంలో విద్యార్థులకు సంవత్సరాది పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొనే్నళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర కొనసాగుతూ వస్తోంది. లీక్‌లు వెలుగుచూసినప్పుడు ప్రభుత్వాలు కమిటీ వేసి చేతులు దులుపుకోవడమే తప్ప సంబంధిత లీకువీరులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్య, ఉన్నత విద్యశాఖల్లో నెలకొన్న ఈ దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీక్‌కు అవకాశం లేకుండా […]

మంత్రి వర్గంలో చేర్పులు మాత్రమే…  ఏప్రిల్ ఆరున విస్తరణ..

మంత్రి వర్గంలో చేర్పులు మాత్రమే… ఏప్రిల్ ఆరున విస్తరణ..

మంత్రివర్గ విస్తరణకు ఏప్రిల్‌ ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇది కేవలం విస్తరణే తప్ప తొలగింపులు ఉండవని తెలుస్తోంది. కనీసం నలుగురు, లేదా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తారని ముందుగా ప్రచారమైంది. కానీ తాజాగా అరదుతున్న సంకేతాల మేరకు కేవలం చేర్పులు మాత్రమే ఉంటాయంటున్నారు. కొందరికి […]

కష్టపడి పని చెయ్యండి..   ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చండి : మంత్రి పల్లె

కష్టపడి పని చెయ్యండి.. ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చండి : మంత్రి పల్లె

సమాచార శాఖ అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ భవన సముదాయంలో గురువారం , రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరేట్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి […]

అమరావతిలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు

అమరావతిలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు

 చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటులో సహకరించేందుకు మలేసియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలుత అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులో తొలిదశలో 30, 40 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏప్రిల్ నెలలో మలేసియా ప్రధానమంత్రి భారత్ పర్యటనలో […]

వైఎస్‌ఆర్‌ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు

వైఎస్‌ఆర్‌ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు

ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌ రెడ్డి గెలుపుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్‌ఆర్‌ ఎల్పీ సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్‌ రెడ్డి విజయంతోపాటు…మూడు చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇచ్చిన పీడీపీ అభ్యర్ధులు గెలవడంతో  పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అమరావతిలో వైఎస్‌ఆర్‌ ఎల్పీ […]

అసెంబ్లీలో మారని తీరు  వాయిదాలతో కొనసాగుతున్న అసెంబ్లీ

అసెంబ్లీలో మారని తీరు వాయిదాలతో కొనసాగుతున్న అసెంబ్లీ

అసెంబ్లీ సమావేశాలు వాయిదాలతోనే కొనసాగుతున్నాయి. సభలో మాకు అకాశం ఇవ్వలేదంటూ వైసీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. మరో వైపు అటు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం  పతాక స్థాయికి చేరింది.. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష […]

టెక్నాలజీ వేటలో బెజవాడ పోలీసులు

టెక్నాలజీ వేటలో బెజవాడ పోలీసులు

భద్రత, నేరాల నియంత్రణకు నగర పోలీసు వ్యవస్థ ఆధునిక సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోనుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోలీసింగ్‌ను పటిష్ట పరచాలని నిర్ణయించారు. నేర పరిశోధనకు ఉపకరించే రీతిలో కమాండ్‌ కంట్రోల్‌స్థాయిని పెంచనున్నారు. కమాండ్‌ కంట్రోల్‌లో ‘ఫేసియల్‌ రికగ్నైజేషన్‌’ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరానికి రాకపోకల తాకిడి పెరిగింది. నిత్యం వేలమంది […]

వైరల్ గా మారిన బాబు అసెంబ్లీ స్పీచ్

వైరల్ గా మారిన బాబు అసెంబ్లీ స్పీచ్

అసెంబ్లీలో ప్రసంగించేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. అక్కడ ప్రసంగాల్లో తప్పులు దొర్లితే అవతల పక్షాలకు దొరికిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ పార్టీ వాళ్లకు అయినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మరి అవతల పక్షాలు తప్పుల కోసం కాచుకుని కూర్చున్న చోట తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు జారారు. ఏదో […]

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని,  ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని, ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]

ఇదీ ఒక గేలుపేనా : వైఎస్ జగన్

ఇదీ ఒక గేలుపేనా : వైఎస్ జగన్

సొమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో వైకాపా అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడంపై  వైఎస్  జగన్ ఇదీ ఒక గేలుపేనా అన్నారు… ఓట్లను కొనుగోలు చేసి చంద్రబాబు సాధించిన విజయం అనైతికమని, అప్రజాస్వామ్యాన్ని  అని ఆయన విమర్శించారు. ఓట్ల కొనుగోలులో […]

అంగన్ వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్…

అంగన్ వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్…

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఐసీడీఎస్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. లబ్దిదారులకు పధకాలు అందించడంతో పక్కదారి పట్టకుండా చూడాలనే యోచనలో సర్కార్ ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆధార్ కార్డులను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా నూతన […]