Post Tagged with: "Ysrcp"

వైఎస్ ను తెగ పొగిడేసిన టీడీపీ ఎంపీ

వైఎస్ ను తెగ పొగిడేసిన టీడీపీ ఎంపీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డిని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గుర్తు చేసుకున్నారు. ఆయన పనితీరును మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట జనం ఉండడానికి కారణం కూడా వైఎస్ పనితీరే అన్నారు. అలాగే జగన్ కూడా ప్రభుత్వంపై పోరాడితే మంచిదని సలహా […]

చూసుకుందాం రా.. అంటూ ఎమ్మెల్యేల సవాల్.!

చూసుకుందాం రా.. అంటూ ఎమ్మెల్యేల సవాల్.!

ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా అధికార పార్టీ- ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ అట్టుడికింది. “రా చూసుకుదామంటూ” వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని సవాళ్లు విసురుకున్నారు. చెవిరెడ్డితో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి సవాల్ చేయడంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి […]

నంద్యాల ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలి : వైఎస్సార్ కాంగ్రెస్ లో అంతర్మథనం

నంద్యాల ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలి : వైఎస్సార్ కాంగ్రెస్ లో అంతర్మథనం

యద్ధంలోనైనా.. రాజకీయంలోనైనా గెలుపే ప్రధానం. ఎలా గెలిచామన్నది కాదు.. గెలిచామా లేదా అన్నదే అందరికీ అవసరం. విజయానికి వ్యూహాలు రూపొందించుకోవడం.. అందుకు అనుగుణంగా అడుగులు వేయడం తెలివైన రాజకీయ నాయకుడి లక్షణం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం అందుకు తగినట్టుగా వ్యవహరించలేకపోతున్నదన్నదే ఆ పార్టీ క్యాడర్‌ ఆవేదనగా ఉంది. అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న […]

కౌన్ బనేగా ప్రెసిడెంట్…..

కౌన్ బనేగా ప్రెసిడెంట్…..

జూలై నెలాఖారు నాటికి దేశానికి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో బలం బాగా తక్కువ. ఈ సభలో ఎన్డీఏకు 77, యూపీఏకు 84 సభ్యులుండగా, రెండు కూటముల్లో లేని ఏఐఏడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, బిజూజనతాదళ్, వైఎస్సార్పీపీ వంటి దాదాపు పది పార్టీలకు 82 మంది […]

2019 ఎన్నికల్లో బీజేపీ జగన్ తో చేతులు కలపనుందా?

2019 ఎన్నికల్లో బీజేపీ జగన్ తో చేతులు కలపనుందా?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఏపీలో బలపడేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు 2019 ఎన్నికల్లో గెలుపు దిశగా చర్యలు చేపడుతుంటే బీజేపీ మాత్రం ఏపీలో తన సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపనుందని సమాచారం. అవినీతి కేసుల్లో […]

జగన్ మోహన్ రెడ్డి పొగరుబోతు : జేసీ

జగన్ మోహన్ రెడ్డి పొగరుబోతు : జేసీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పదిమంది వరకు మృతి చెందారు. అప్పుడు జగన్ హడావుడి చేశారని జేసీ ప్రభాకర్ […]

భూమా సీటు నీకా? నాకా?

భూమా సీటు నీకా? నాకా?

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గ ఉపఎన్నికపై అప్పుడే రాజకీయం మొదలైంది. ఎవరైనా చనిపోవడం ద్వారా అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఎన్నికలు వస్తే.. ఆ సీటులో చనిపోయిన కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పార్టీలు పోటీకి అభ్యర్థులను నిలపరాదన్న […]

రోజా మరో ఏడాది సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు

రోజా మరో ఏడాది సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు

నగరి ఎమ్మెల్యే రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సభాహక్కుల కమిటీ ఈరోజు తమ నివేదికను శాసనసభకు సమర్పించింది. గొల్లపల్లి సూర్యారావు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రవణ్‌కుమార్‌, జ్యోతుల నెహ్రూలు సభ్యులుగా ఉన్నారు. గతేడాది అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సభలోనే సభాపతికి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. అనిత […]

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు పరిటాల సునీత అండ!

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు పరిటాల సునీత అండ!

అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మంత్రిపరిటాల సునీతకు వ్యతిరేకంగా టీడీపీలో ఒక వర్గం పావులు కదుపుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పరిటాల సునీతను బలహీనపరిచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ధర్మవరంలో వర్గపోరును ఆసరాగా చేసుకుని సునీతకు చెక్‌ పెట్టేందుకు వైరివర్గం ప్రయత్నిస్తోంది. పరిటాల […]

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన టార్చర్ వల్లే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చి హఠాన్మరణం చెందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కే. రోజా ఆరోపించారు. భూమా మృతికి ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాయ్‌కట్ చేశారు. రోజా మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే […]

నంధ్యాల అభివృద్దికోసం భూమా తపన 

నంధ్యాల అభివృద్దికోసం భూమా తపన 

భూమా నాగిరెడ్డిది ఉమ్మడి కుటుంబమని, ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం అని కర్నూల్‌ జిల్లా టిడిపి నేత ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. సంతాప తీర్మాన సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా భూమా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. భూమా ముగ్గురు అన్నదమ్ములను కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో రాజకీయాల్లో నిలబడగలిగారని కొనియాడారు. చంద్ర బాబు ఆదేశాలతో భూమా అప్పటి […]

సైకిల్ ఎక్కనున్న ఎమ్మెల్సీ చెంగల్రాయుడు

సైకిల్ ఎక్కనున్న ఎమ్మెల్సీ చెంగల్రాయుడు

విభజన ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నవ్యాంధ్రలో చట్టసభ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే వారు ఎమ్మెల్సీలే. ఒక్క ఎంపీ సీటు కానీ, ఎమ్మెల్యే సీటు కానీ గెలుచుకోలేకపోవడంతో ఏపీ అసెంబ్లీలో కానీ ,లోక్ సభలో  ఏపీ నుంచి కానీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం  లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు కూడా జారిపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని […]

విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం

విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం

 వైసీపీ విశాఖ రైల్వే జోన్ ఉద్యమానికి తెరలేపనుంది. రైల్వే జోన్ అంశంతో రాజకీయంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో పైచేయి సాధించేందుకు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యాన పాదయాత్ర కు సిద్ధం అవుతోంది.  వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఓటమి తర్వాత విశాఖలో డీలాపడిన పార్టీలో గత కొద్దినెలల నుంచి జగన్ తన పర్యటనలతో చైతన్యం తెచ్చే […]

మళ్లీ  తెరపైకి ప్రత్యేక హోదా

మళ్లీ  తెరపైకి ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది.  రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా సాధించడానికి అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమానికి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎవరిదారి వారిదే అయితే పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. వైసిపి, వామపక్షాలు, జనసేన, అమ్ […]

ఏపీలో ఎవరోస్తున్నారు ..? ఎవరెళుతున్నారు ?

ఏపీలో ఎవరోస్తున్నారు ..? ఎవరెళుతున్నారు ?

ఏపీ క్యాబినేట్ లోకి ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు రానున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వైసీపీనుంచి తెలుగుదేశంలోకి వచ్చిన 22 మంది ఎమ్మెల్యేలో ముగ్గురికి ఈసారి అవకాశం దగ్గనున్నది. […]