Home > World News > International > ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

ఉల్లాసంగా..ఉత్సాహంగా టీఏజీసీ వనభోజనాలు

భారత్ పై ప్రభావం చూపించనున్న గల్ఫ్ గోడవ
వాళ్లు వస్తూనే కొట్టుకుంటూ వచ్చారు : లాడెన్ భార్య

TAGC-apduniaఅందరూ మెచ్చే సేవా కార్యక్రమాలు చేస్తూ చికాగో మహా నగర తెలుగు సంస్థ, టీఏజీసీ (TAGC) సేవకు మారుపేరుగా నిలుస్తోంది. ప్రతియేటా వేసవిని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికీ వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈసారి చికాగో శివారు ఎల్క్ గ్రోవ్ గ్రామంలోని బస్సే వుడ్స్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. 950 మందికి పైగా సభ్యులు, ఇతర అతిథులు హాజరయ్యారు. చిన్నాపెద్ద తేడా లేకుండా వన భోజనాల్లో ఆనందోత్సాహాలతో పాలు పంచుకున్నారు. టీఏజీసీ (TAGC) కార్యవర్గ సభ్యులు స్వహస్తాలతో అన్నం, కోడికూర, ఆలుగడ్డ టమాట కూర వండి వడ్డించడం ఈసారి ప్రత్యేకం. పార్క్ లోనే వచ్చిన వారికి గ్రిల్ల్డ్ చికెన్, వేడి వేడి దోసెలు, బజ్జీలు వేసి వడ్డించారు. మధ్యాహ్న భోజనం తర్వాత పుచ్చకాయ, చల్ల (మజ్జిగ) అందించారు. ఆహూతులను అలరించేందుకు అట విడుపు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇలా మూడు విభాగాలుగా పలు పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, టగ్ అఫ్ వార్ ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గెలిచిన వారికీ బహుమతులు అందజేశారు. స్వచ్చంద సేవా కార్యక్రమాలకు ఫండ్ రైసింగ్ కు గాను రెండు మైళ్ళ నడక (Walkathon ) పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును అక్షయ విద్య ఫౌండేషన్ కు అందజేశారు. పోటీలలో గెలిచిన వారికీ బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా వంటల పోటీలను నిర్వహించారు. నోరూరించే వంటలతో పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తెలంగాణ సకినాలకు మొదటి బహుమతి, రవ్వ లడ్డులకు రెండవ బహుమతి లభించింది. వన భోజనాలను అద్భుతంగా నిర్వహించినందుకు గాను టీఏజీసీ (TAGC) అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే పిక్నిక్ కోర్ కమిటీ సభ్యులను అభినందించారు. రాము బిల్లకంటి, రంగ రెడ్డి లంకల, ఉమా అవధూత, విజయ్ బీరం, వాణి ఏట్రింతల, సంపత్ సంగేమ్, సాయి గొంగాటీ, వాలంటీర్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. రామచంద్రా రెడ్డి ఏడే కార్యక్రమాన్ని ముగిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యవర్గ సభ్యులకు, స్పాన్సర్స్, వాలంటీర్లు. అతిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

This slideshow requires JavaScript.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *