Home > Politics > “స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను అగ్ర‌స్థానంలో నిలుపుదాం”

“స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను అగ్ర‌స్థానంలో నిలుపుదాం”

తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి
అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

swach-sarvekshan-apduniaదేశ‌వ్యాప్తంగా 4,041 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల మ‌ధ్య జ‌రిగే స్వ‌చ్ఛ సర్వేక్ష‌ణ్ -2018 స్వ‌చ్ఛ‌త పోటీల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో నిల‌ప‌డానికి జీహెచ్ఎంసీ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్దంచేసింది. ఇందుకుగాను నేడు జీహెచ్ఎంసీ విభాగ అధికారులు జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో క‌మిష‌న‌ర్ విస్తృత‌స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు కెన‌డి, శంక‌ర‌య్య‌, ర‌వికిర‌ణ్‌, భాస్క‌రాచారి, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, ర‌ఘుప్ర‌సాద్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, గంగాధ‌ర్‌రెడ్డి, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌కుమార్‌, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ -2018కిగాను మొత్తం వివిధ విభాగాల్లో 4,000మార్కుల‌ను కేటాయిస్తూ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించింది. అయితే 2018 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు చేప‌ట్టిన ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాల్లో అత్య‌ధిక జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు ఉన్నాయ‌ని క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ఈ స‌ర్వేలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చిన దృష్ట్యా స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ‌త మొబైల్ యాప్‌ను దాదాపు 2ల‌క్ష‌ల మందిచే డౌన్‌లోడ్ చేయించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఈ సారి స‌ర్వేలో కేటాయించిన 4వేల మార్కుల్లో ప్ర‌ధానంగా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై న‌గ‌ర‌వాసుల ఫీడ్‌బ్యాక్‌కు అత్య‌ధికంగా 40శాతం (1600)మార్కులు, న‌గ‌రంలో చేప‌ట్టిన ప‌లు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలు, వాటి ప్ర‌భావంపై అంద‌జేసే నివేదిక‌ల‌కు 35శాతం(1400), స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ స‌ర్వే బృందం నేరుగా చేప‌ట్టే క్షేత్ర స్థాయి త‌నిఖీల్లో అబ్జ‌ర్వేష‌న్ల‌కు 25శాతం(1000) మార్కులు ఉన్నాయ‌ని వివ‌రించారు. కాగా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు స‌మ‌ర్పించిన డాక్యుమెంట్ల‌కు, క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో తేడా ఉంటే నెగిటీవ్ మార్కుల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌డం ప్ర‌త్యేక‌త‌. 2017లో ఈ సారి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో అమ‌లు చేసిన ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాలలో ప్ర‌ధానంగా ఓపెన్ గార్బెజ్ పాయింట్ల ఎత్తివేత‌, రెండు డ‌స్ట్‌బిన్‌ల పంపిణీ విధానం, స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్తను వేర్వేరుగా సేక‌ర‌ణ‌, దోమ‌ల నివార‌ణ‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం క‌ల్పించే ప్ర‌చార అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేకంగా మార్కుల‌ను కేటాయిస్తూ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించిందని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని అన్ని మార్కెట్లలో కంపోస్టింగ్ యూనిట్ల ఏర్పాటు చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, న‌గ‌రంలోని అన్ని పెట్రోల్ బంక్‌ల‌లో ఉన్న టాయిలెట్ల‌ను ప్ర‌జ‌లు ఉప‌యోగించుకునేలా సంబంధిత బంక్‌ల యాజ‌మ‌న్యాల‌తో లిఖిత‌పూర్వ‌కంగా లేఖ‌ల‌ను స్వీక‌రించాల‌ని పేర్కొన్నారు. పాఠ‌శాల స్థాయి నుండే విద్యార్థినీవిద్యార్థుల్లో స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై చైత‌న్యం క‌లిగించేలా ప్ర‌తి పాఠ‌శాల‌లో స్వ‌చ్ఛత క‌మిటీల‌ను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో 50 ప్రాంతాల్లో డ్రై రిసోర్స్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాల‌ని సూచించారు.

హోట‌ళ్ల త‌నిఖీపై యాప్ ప్రారంభం
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌గ‌ర‌వాసుల‌కు నాణ్య‌మైన ఆహారం, స్వ‌చ్ఛ మంచినీరు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను అందించే దిశ‌గా హోట‌ళ్ల త‌నిఖీల‌పై రూపొందించిన ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను క‌మిష‌న‌ర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. హోట‌ళ్ల త‌నిఖీలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారిత‌నం ఉండాల‌నే ఉద్దేశంతో హోట‌ళ్ల త‌నిఖీ కై జీహెచ్ఎంసీ రూపొందించిన మొబైల్ యాప్‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ గ‌తంలోనే ప్రారంభించ‌గా కొద్దిరోజుల క్రితం జ‌రిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీలో ఆమోదించారు. మొత్తం 21 ప్ర‌శ్న‌లతో కూడిన ఈ యాప్‌లో హోట‌ళ్ల‌కు సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. త‌నిఖీ నిర్వ‌హించ‌డానికి మెడిక‌ల్ ఆఫీస‌ర్లకు అధికారాలు ఇచ్చామ‌ని త‌నిఖీ పూర్తికాగానే పెనాల్టీ ఛ‌లాన్ మొత్తం వ‌స్తుంద‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *