Home > Politics > ఇవాళ్టి జీఎస్టీపై తెలంగాణ కొండంత ఆశలు

ఇవాళ్టి జీఎస్టీపై తెలంగాణ కొండంత ఆశలు

అడ్డంకులు సృష్టించినా వెన‌కాడేది లేదు: చ‌ంద్ర‌బాబు
ప్రవాసాంధ్రుల ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన

gst-apduniaసెప్టెంబర్ 9న జరిగే కౌన్సిల్ సమావేశం కొంత కీలకం కానుంది. ఈసారి కూడా జీఎస్టీ సమావేశానికి ఆర్ధిక మంత్రికి బదులు ఐటీ మంత్రి కేటీఆరే హాజరుఅవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపయోగ నిర్మాణాలకు జీఎస్టీ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించకపోతే న్యాయపోరాటం చేస్తామని కేంద్రానికి హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈనెల 9న హైదరాబాద్ లో జరగబోతొంది. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేసీఆర్ సర్కారు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజాపయోగ నిర్మాణాలపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని పదేపదే కోరింది కేసీఆర్ సర్కారు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ విజ్జప్తి మేరకు వీటిపై ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించింది కేంద్రం. కానీ దాన్ని ఐదు శాతానికి తగ్గించాల్సిందేనని గట్టిగా పట్టుబడుతోంది తెలంగాణ రాష్ట్రం. ఇక నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ప్రజాపయోగ నిర్మాణాలపై ఉన్న పన్నెండుశాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని ఆయనకు విజ్జప్తి చేశారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై విధించే జీఎస్టీని తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్జప్తిపై సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్కు హామీనిచ్చారు అరుణ్ జైట్లీ. ఇక జీఎస్టీ సమావేశానికి మరోమారు ఐటీ మంత్రి కేటీఆరే హాజరయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత జీఎస్టీ సమావేశానికి కూడా కేటీఆరే హాజరయ్యారు. జీఎస్టీని తగ్గించాలని సమావేశంలో గట్టిగా ప్రభుత్వ వాదనను ఆయన వినిపించారు. దీంతో మారోమారు ఆయన్నే ఈ సమావేశానికి పంపే అవకాశాలున్నాయని చెబుతున్నా… అదే రోజు ఢిల్లీలో స్కోచ్ సమ్మిట్ అవార్డుకార్యక్రమం ఉంది. దానికి కేటీఆర్ హాజరుకావాల్సివుంది. మరి కేటీఆర్ ఆ అవార్డు కార్యక్రమంలో పాల్గొంటే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆర్ధిక మంత్రి ఈటెలనే హాజరు అవుతారు. సెప్టెంబర్ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి…రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎటువంటి వాదనలు వినిపించాలనే అంశంపై రెండు రోజులుగా సీఎస్ ఎస్పీ సింగ్ వివిధ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఇరిగేషన్, హౌజింగ్, ఆర్ధికశాఖ, కమర్షియల్ ట్యాక్స్, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో వరుసగా రెండు రోజుల పాటు సమావేశమైన సీఎస్ ఎస్పీ సింగ్…. జీఎస్టీ ప్రభావంపై మరోమారు అంచనాలు వేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాతైనా…కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించకపోతే… న్యాయపోరాటానికి సిద్దం కావాలని కేసీఆర్ సర్కారు డిసైడ్ అయింది. ఈ సమావేశం తరువాత జీఎస్టీ తగ్గింపు విషయంలో కేంద్రంతో ఆమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. మరి కేంద్రం ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *