Home > Politics > ప్లస్ టూ వరకు తెలుగు కంపల్సరీ

ప్లస్ టూ వరకు తెలుగు కంపల్సరీ

తెలంగాణ డీఎస్సీపై సోషల్ మీడియాలో జోకులు
చంద్రబాబుతో లగడపాటి సమావేశం

telangana-govt-apduniaతెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని, తెలుగును బోధించే విద్యాసంస్థలకే మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని సీఎం తెలిపారు. ఉర్దూను కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాషను కూడా ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండాలన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్‌ మీడియట్‌ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పన చేయాల్సిన బాధ్యత సాహిత్య అకాడమీదేనని ఆదేశించారు. వెంటనే సిలబస్‌ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలన్నారు. వారు తయారు చేసిన సిలబస్‌నే బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్టు వారు పుస్తకాలు ముద్రించుకోవడానికి కుదరదు అని సీఎం సృష్టం చేశారు. తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల బోర్డులను తెలుగులోనే రాయాలని ఆదేశించారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నట్టు తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు ణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందఠంగా తెలుగు భాషను పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర?యాలను ప్రకటించారు. మహసభల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. పన్నెండో తరగతి వరకు తెలుగు భాషను కచ్చితత్వం చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య స్వాగతించారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దీనిని అమలుచేసేలా గట్టిగా చర్యలు తీసుకోవాలని చుక్కా రామయ్య కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *