Home > Politics > మోత్కుపల్లిపై వేటుకు రంగం సిద్ధం

మోత్కుపల్లిపై వేటుకు రంగం సిద్ధం

మోడి అంటే హడలిపోతున్నారు : పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి
నల్లారికి కాంగ్రెస్ కాల్

mothkupalli-apduniaతెలుగుదేశంలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కథ ముగిసినట్లే కనిపిస్తోంది.ఆయనపైన కఠినంగా వ్యవహారించాలని టీడీపీ నాయకత్వం నిర్ణయింది.తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే చర్యలు తప్పవని పార్టీ స్పష్టమైన సంకేతాలిచ్చింది.మోత్కుపల్లి మాత్రం తన మౌనముద్రను కొనసాగిస్తున్నారు. టీడీపీని టీఆర్ఎస్‌ లో విలీనం చేయాలంటు సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారం ఆ పార్టీలో మంటలు పుట్టిస్తోంది. ఆయన తీరుపైన పార్టీ నేతలు మండిపడుతున్నారు. మోత్కుపల్లి పైన చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ నాయకత్వం అధిష్టానానికి సిఫారసు చేిసింది. టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేయాలంటు మోత్కుపల్లి పార్టీ కార్యకర్తల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనను వదిలిపెట్టేది లేదని సీనియర్ నేతలు స్పష్టం చేశారు. తక్షణమే తన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మోత్కుపల్లి స్పందించలేదు. ఆయన సోదరుడు మరణించడంతో ఈ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో పాటు నర్సింహులు కూడా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. సోదరుడి దశదిన కర్మ ముగిసేంత వరకు మాట్లాడవొద్దని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు. ఫోన్ లో కూడా మోత్కుపల్లి అందుబాటులో ఉండటం లేదు.మోత్కుపల్లి టీఆర్ఎస్‌ లో చేరడానికి సిద్ధమౌతున్నారని ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతానికి ఆయన పార్టీ మారే ఆలోచనలో కూడా లేరని నర్సింహులు అనుచరులు స్పష్టం చేస్తున్నారు.మరో వైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మోత్కుపల్లి విషయంలో తన స్వరాన్ని పెంచారు. విలీన వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చి పార్టీకి క్షమాపణ చెప్పాలని రమణ స్పష్టం చేశారు. లేకుండా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. ఎంతటి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, లేకంటే వేటు ఖాయమని రమణ ప్రకటించారు. ఇదే సమయంలో రమణ వ్యాఖ్యలపైన పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మోత్కుపల్లి అంశాన్ని అధినేత చంద్రబాబునాయుడికి వదిలేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఏముందనే భావన వారిలో వ్యక్తమౌతోంది. సీనియర్ నాయకులందరిని పార్టీ నుంచి పంపించి వేస్తే భవిష్యత్తు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆవేశంలో తాను నోరు జారానని మోత్కుపల్లి అంటున్నారని, అలాంటప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేయకుండా అధిష్టానానికి వదిలేయాలని వారు సూచిస్తున్నారు. అయితే కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన మోత్కుపల్లిపైన చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రమణ వర్గం వాదిస్తోంది. మొత్తానికి నర్సింహులను పార్టీ నుంచి పంపించడానికే ఎక్కువ మంది నాయకులు మొగ్గు చూపిస్తుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *