Home > Politics > మోత్కుపల్లిపై చర్యలకు అంతా రెడీ

మోత్కుపల్లిపై చర్యలకు అంతా రెడీ

పార్టీ దిశగా ఆర్ కృష్ణ‌య్య అడుగులు
రచ్చ గెలుస్తున్నాడు... మరి ఇంట సంగతేంటి

mothkupalli-apduniaతెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులను బయటకు పంపేందుకు రంగం సిద్దమైందట. త్వరలోనే ఆయన్ను ఇంటికి పంపుతారని తెలుస్తోంది. పార్టీ నుంచి గెంటేయక ముందే వెళ్లాలనే సంకేతాలిస్తున్నారట. ఇందుకు ఆయన సిద్దంగా ఉన్నారంటున్నారు. తెలంగాణలో టీడీపీకి సీన్ లేదని… టీఆర్ఎస్ లో కలిపేయాలని ఇటీవల మోత్కుపల్లి చేసిన కామెంట్. అతను కాకుండా మరెవరు ఆ మాట అన్నా.. ఇప్పటికే సంగతి తేల్చేవారు. కానీ ఆ పని చేయలేదు. సి.ఎం చంద్రబాబునాయుడుతో నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఎలాంటి ఢోకా లేదు. కాస్త నేతలను కాపాడుకుంటే రాబోయే రోజుల్లో తిరిగి టీడీపీ బలం పుంజుకుంటుందని చెప్పారు ఆ నేతలు. ఇందుకు చంద్రబాబు ఓకే అన్నారని తెలుస్తోంది.  గవర్నర్ గిరీ వస్తుందని ఎన్నాళ్లుగానో ఎదురు చూశారు మోత్కుపల్లి. అందుకే టీఆర్ఎస్ లోకి జంప్ చేయకుండా ఆగారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే విషయం కాదని తేలింది. అందుకే ఇక తన దారి తాను చూసుకునేందుకు మోత్కుపల్లి సిద్దమయ్యారు. వెళుతూ వెళుతూ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి మరీ వెళ్లేందకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. అందుకే ఇక మీదట ఆయనపై చర్యల విషయంలో ఆలస్యం చేయకూడదనే ఆలోచనకు చంద్రబాబు వచ్చారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *