Home > Politics > కమలం, ఫ్యాను మధ్యలో సైకిల్

కమలం, ఫ్యాను మధ్యలో సైకిల్

వైరాగ్యం... నైరాశ్యంలో జగన్
గర్భిణులకు వరంగా ప్రధానమంత్రి మాత వందన యోజన

telugudesam-apduniaఏపీ సీఎం చంద్రబాబు కనిపించే రాజకీయ శత్రువు వైసీపీ, కలసిరాని మిత్రపక్షం బీజేపీతో పోరాడుతున్నారు. ఓ వైపు కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అందని దన్ను.. మరోవైపు రాజకీయ ఒత్తిడి పెంచుతున్న ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, ఇతర విపక్షాల రాజకీయ ఉద్యమాలతో ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలకాంశాలపై మరోవైపు కేంద్రంతో పోరాడుతున్నారు. విభజన హామీలు అమలుచేస్తామన్న బీజేపీతో జతకట్టి గెలిచిన తేదేపా, ఇప్పుడు కేంద్రాన్ని నమ్మి జనం దృష్టిలో ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలవరం, అమరావతి నగర నిర్మాణం, రెవిన్యూ లోటు భర్తీ వంటి అతి పెద్ద సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని గందరగోళం మధ్య వైసీపీ సహా విపక్షాలు రాజకీయంగా వత్తిడి పెంచుతున్నాయ.ప్రధానంగా రెవిన్యూలోటు భర్తీ కింద 13 వేల కోట్లలో 9 వేల కోట్లు రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. రైల్వే జోన్, విద్యాసంస్థలకు పూర్తిస్థాయి నిధులు, అమరావతి నగర నిర్మాణానికి రావలసిన రెండు వేల కోట్లు వంటి పెద్ద సమస్యలతోపాటు.. ఆంధ్ర- తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కొనసాగుతున్న విభజన సమస్యలను పరిష్కరించని కేంద్రంతో పోరాడుతున్నారు. బీజేపీ సహాయ నిరాకరణతో ప్రజల్లో వెల్లువెత్తుతోన్న ఆగ్రహం తెదేపా ఖాతాలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీతో మైత్రి ఎంతవరకు కొనసాగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొనడంతో, సంక్షేమ బలంతోనే వచ్చే ఎన్నికల్లో పట్టుసాధించే ప్రణాళికా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లోగా 29 ఇరిగేషన్ ప్రాజెక్టులు, 5 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో వెళ్తున్న బాబు సర్కారు.. ఇప్పటికే లక్షా 25 వేల మందితో గృహప్రవేశాలు చేయించారు. అధికారంలోకి వచ్చాక సాధించిన సంక్షేమాన్ని ప్రచారం చేసుకునే ఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆలోచనా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం, విభజన హామీలపై అమలు కోసం రాజకీయ పరంగా కేంద్రంపై పార్లమెంటులో పోరాటానికి అమరావతి నుంచి దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *