Home > Politics > పత్తికొండ నియోజకవర్గంలో టిడిపిలో వర్గపోరు

పత్తికొండ నియోజకవర్గంలో టిడిపిలో వర్గపోరు

డిసెంబర్ ఆరు తర్వాత మళ్లీ కాపు ఉద్యమం
త్వరలో ప్రధాని స్కాలర్ షిప్

telugudesamపార్టీని ప్రజలకు దగ్గర చేయాలన్న ఉద్దేశ్యంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల యోగక్షేమాలు, ప్రతి కుటుంబంలో పార్టీ సభ్యత్వం, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదా తెలుసుకోవాల్సి ఉంది. అంతేకాక ప్రతి ఇంటిపై టిడిపి జెండా ఎగరాలన్న ఉద్దేశ్యంతో నేతలు యత్నిస్తున్నారు. అయితే పత్తికొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రెండు లేక మూడు వర్గాలు ఉన్నాయని, వారిని సమన్వయం చేయడంలో స్థానిక నాయకులు విఫలమవుతున్నారని కార్యకర్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే పత్తికొండలో ప్రధానంగా రెండు వర్గాలు ఉన్నాయి. వీరి మధ్య ప్రధానంగా నాయకత్వ పోటీ ఉంది. ఈ పోటీ వీరు మధ్య విబేధాలకు కారణమవుతోంది.

పత్తికొండలో విపక్ష పార్టీల్లో విబేధాలు లేవు. అధికార పార్టీలోనే వర్గ పోరు విపరీతంగా ఉందన్నది కార్యకర్తల మాట. వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీ పరంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉందని వారు అంటున్నారు. విబేధాలు సత్వరమే పరిష్కరించుకోకపోతే సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంగా స్థానికంగా నీరుగారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక నేతల్లో సమన్వయ లోపం, విబేధాలు తీవ్ర స్థాయిలో ఉండడం ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుందని ఇప్పటికైనా పార్టీ కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కార్యకర్తల విన్నపాలను నేతలు గౌరవించి ఒక్కటవుతారా? లేక విబేధాలతోనే కాలక్షేపం చేస్తారా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *