Home > Politics > టీడీపీ వాణి కోసం…తెగ ప్రయత్నాలు

టీడీపీ వాణి కోసం…తెగ ప్రయత్నాలు

చంద్రబాబుకు పోలవరం కష్టాలు
కలకలం రేపుతున్న హార్దిక్ పటేల్ రాసలీలలు

vani-viswanath-apduniaమరోసారి మీడియా ముందుకు వచ్చారు సినీ నటి వాణి విశ్వనాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. అది చూసే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీనటి వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన ఆమె మనసులో మాటలను వెల్లడించారు. అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. తాను త్వరలో తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని, తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని మరో మాట చెప్పడం ఇప్పుడు హాట్ టాపికైంది. అమరావతికి వచ్చిన వాణి విశ్వనాధ్ తాను తెల్లారి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ ఆమె చేరిక ఆలస్యమవుతోంది. తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించినా టీడీపీ నుంచి ఇంత వరకూ ఎవరూ మాట్లాడలేదు. ఫలితంగా రోజాకు ఆమె గట్టి పోటీ కాదనే చర్చ సాగుతోంది. ఇంకోవైపు జీవిత రాజశేఖర్ దంపతులను తీసుకువచ్చే ఆలోచన చేస్తోంది టీడీపీ. అప్పుడు మాటకు మాట గట్టిగానే పడే అవకాశముంది. మెత్తగా ఉన్న వాణి విశ్వనాద్ పైర్ బ్రాండ్ లాంటి రోజా ముందు తస్సుమనడం ఖాయమంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *