Home > Bhakti > మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

పాతపల్లిలో నాన్‌ వెజ్‌ హనుమా
దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!

durgamma-temple-apduniaదసరా ఉత్సవాల్లో ఈసారి మూలానక్షత్రం రోజున తెలుగు రాష్ట్రాల సీఎంలు కనక దుర్గ అమ్మవారిని దర్శించనున్నారు. ఈ నెల 27వ తేదీ మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సంప్రదాయం ప్రకారం మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను స‌మ‌ర్పిస్తారు. ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నిర్వహిస్తారు. రాష్ట్రమంత్రులూ ఆయన వెంట పాల్గొంటారు. సాధారణంగానే దసరా ఉత్సవాల్లో ప్రతిరోజూ మంత్రులు, ఉన్నతాధికారులు, జడ్జిలు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. రాష్ట్రం విడిపోయాక అమ్మవారికి తెలంగాణ నుంచి ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 27వ తేదీ మూలానక్షత్రం రోజున అమ్మవారిని ద‌ర్శించుకొనున్నారు. గతంలో మొక్కుకున్న మేరకు ముక్కుపుడక సమర్పించడానికి ఆల‌యనికి వస్తున్నారని సమాచారం.

శ్రావణ మాసంలో కేసీఆర్ విజయవాడ వస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం దసరా ఉత్సవాల్లో ఆయన అమ్మవారికి ముక్కుపుడక సమర్పించడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల రాకతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సాధారణంగా రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్ర్తాల సమర్పణ సాయంత్రం ఐదు గంటల సమయంలో జరుగుతుంది. సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఏ సమయానికి వచ్చినా గట్టి బందోబస్తు చేపడతారు. మూలానక్షత్రం రోజున వేకువజామున రెండుగంటల నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అయితే సీఎంల రాక సందర్భంగా ఆలయంలో సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్సాట్లు చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మొత్తానికి మూల న‌క్షత్రం రొజు ఇద్దరు చంద్రుల‌ను ఒకేసారి చూసే అవ‌కాశం సామాన్యుల‌కు క‌లగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *