Home > Politics > అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం
ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్

ramnath-kovind_Apduniaఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాధ్  కోవింద్ కు  తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ‘అత్యున్నత పదవికి జరిగిన ఇది అత్యుత్తమ ఎంపిక’ అని ఆయన  ప్రధానమంత్రితో అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు జరిపి సమన్వయకర్తగా వ్యవహరిస్తానని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు వర్చువల్ ఇన్స్పెక్టన్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది. భారత  రాష్ట్రపతి పదవికి బీహార్ గవర్నర్ గా ఉన్న రామ నాథ్ కోవింద్ ను  ఎన్టీఏ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ప్రధాని మోడీ ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్డేఏ భాగస్వామ్య పక్షంగా తమకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్యక్షుడిగా వున్న చంద్రబాబును కోరారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఆ తరువాత బీజేపీలో  దళిత నేతగా ఎదిగిన రామ్ నాథ్ కోవింద ఉత్తర్ ప్రదేశ్ నుంచి  రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలందించారని చంద్రబాబు పేర్నొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం విదేశాల్లో వున్నందున ఇక్కడికి వచ్చాక ఆమెతో సంప్రదిస్తానని చంద్రబాబు ప్రధానమంత్రికి తెలిపారు.
 సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రిని ఆయన అభినందించారు. పార్లమెంటేరియన్ గా వున్న పన్నెండేళ్లూ రామ్ నాధ్  గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పనకు తీవ్ర  కృషి చేశారని గుర్తుచేశారు. దళిత మేధావి రామ్ నాధ్ ను  రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేయడం నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వాలకు వున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు.  దేశంలోని మిగిలిన రాజకీయ పక్షాలు కూడా రామ్నాథ్ ఎంపికకు మద్దతు తెలపాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *