Home > Politics > ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణి : మంత్రి తలసాని

ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణి : మంత్రి తలసాని

బాబు మీరైతేనే... బాగుంటుంది : మోడీ
స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం

Talasani_Apduniaఈ నెల 20 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా   గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ  గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక గ్రామంలో గొర్రెల పంపిణీ ని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేకర్ రావు 20 తేదీన ప్రారంబిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జరిగే  గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ లు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ లు, ఎంపీపీ లు, జెడ్పీటీసీ  లు, సర్పంచ్ లు, ఎంపీ టీసీ  లు తదితర ప్రజాప్రతినిదులు అందరు పాల్గొంటారని అన్నారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే కులవ్రుత్తులపై ఆదారపడిన వారికి ప్రభుత్వం చేయూతను ఇస్తుందని మంత్రిఅన్నారు. ఇచ్చిన  మాట ప్రకారం ఈ సంవత్సరం సొసైటీ లలో  50 శాతం మంది గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని అయన అన్నారు. ప్రభుత్వం జరిపిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 8,710  గ్రామాలలో 7,846 సొసైటీ లలో 7,61,895 మంది  సబ్యులుగా నమోదు అయ్యారని తలసాని తెలిపారు. వీరిలో ఈ సంవత్సరం 3,60,098 మందికి,  వచ్చే సంవత్సరం 3,57,971 మందికి గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుంది.  గొర్రెల పంపిణీ పథకం అమలుకు ఎన్ని కోట్లు అయినా  ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *