Home > Politics > స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం

స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం

ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణి : మంత్రి తలసాని
అత్యున్నత పదవికి అత్యుత్తమ ఎంపిక రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

Led_Apdunia గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25లక్షల నివాసాలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఆదా చేయడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కనీసం నాలుగు ఎల్.ఇ.డి బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను తగ్గింపు రేట్లపై స్వయం సహాయక బృందాల ద్వారా విక్రయించడానికి జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దాదాపు 50శాతం విద్యుత్ ఆదా ఎల్.ఇ.డి లైట్ల ద్వారా అవుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా ఎల్.ఇ.డి లైట్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను విక్రయిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నేటికి కేవలం నాలుగు లక్షల 20వేల ఎల్.ఇ.డి లైట్లను మాత్రమే విక్రయించడంతో ఈ ప్రక్రియను మరింత వేగంగా చేయడానికి నగరంలో ఉన్న నాలుగున్నర లక్షల స్వయం సహాయక బృందాల మహిళల సహకారం చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.  ఇందుకుగాను ఒక ఎల్.ఇ.డి లైట్ విక్రయానికి పది రూపాయలు, ట్యూబ్లైట్కు 12రూపాయలు, ఫ్యాన్ను విక్రయిస్తే 102 రూపాయల కమీషన్ను టౌన్లేవల్ ఫెడరేషన్లకు స్వయం సహాయక మహిళలకు అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎల్.ఇ.డిలను అందించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇఇఎస్ఎల్కు, టౌన్లేవల్
ఫెడరేషన్లకు మధ్య నేరుగా విక్రయాలకు సంబంధించి ఒప్పందం జరగనుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమక్షంలో జరిగే ఈ ఒప్పందం ద్వారా నగరంలోని నాలుగున్నర లక్షల మహిళా సభ్యులకు ఆర్థికంగా లాభం
చేకూరడంతో పాటు టీఎల్ఎఫ్ కూడా మరింత బలోపేతం కానున్నాయి. ఎల్.ఇ.డి విక్రయాలకు సంబంధించి ప్రత్యేకంగా కమ్యునిటి రిసోర్స్ పర్సన్లను కూడా నియమిస్తున్నారు. టౌన్లేవల్ ఫెడరేషన్లు ఈ విక్రయాలను స్వయం సహాయక బృందాల ద్వారా చేపట్టే ఈ ఎల్.ఇ.డి విక్రయాలను టౌన్లేవల్ ఫెడరేషన్లు పర్యవేక్షించనున్నాయి. ఇఇఎస్ఎల్ నేరుగా ఎల్.ఇ.డి బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను టౌన్లేవల్ ఫెడరేషన్లకు అందిస్తుంది. ఈ టిఎల్ఎఫ్ల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు ఎల్.ఇ.డిలను పంపిణీ చేస్తారు. విక్రయాలకు అందించే ఎల్.ఇ.డిలకు అయ్యే మొత్తం వ్యయాన్ని 15రోజుల్లోగా టిఎల్ఎఫ్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *