Home > Politics > ఎన్డీఏ రాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు

ఎన్డీఏ రాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్..

ram nadh_apduniaనెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికార ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.  బిహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ ను రాష్ట్రపతి  అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం  మగిసిన అనంతరం కోవింద్‌ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని  తెలిపారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు. 23న రామనాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ వేసే అవకాశముంది. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామనాథ్‌ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఆయన పేరును ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్‌‌. 1945, అక్టోబర్‌ 1న జన్మించిన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *