Home > Editorial > ర్యాంకులు సరే… అనుకూలతలు ఏవీ

ర్యాంకులు సరే… అనుకూలతలు ఏవీ

సౌత్ లో మిగులు కరెంట్ వినియోగించుకొనేందుకు ప్లాన్
పాకిస్తాన్ లో కలసి రాని పదవులు

modi-business-apduniaప్రధాని నరేంద్ర మోడీపాలన పగ్గాలుచేపట్టిన తర్వాత భారత్‌లో బిజినెస్‌ సానుకూలత పెరిగింది. స్వ యంగా ప్రపంచ దేశాల అధినేతలే ఈ అంశాన్ని అంగీకరించారు. అయితే కొన్నికొన్ని అంశాల పరంగా విభేదిస్తు న్నా పన్నుల అరాచకం తగ్గించాలని ఒకే దేశం ఒకేపన్ను ఒకే మార్కెట్‌ దిశగా ఉండాలన్న ప్రతిపాదనల మేరకు భారత్‌లో జిఎస్‌టి అమలైంది. ఇక తాజాగా పెట్టుబడు లు పెట్టేందుకు అనువుగా ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయనేచెప్పాలి. బిజినెస్‌ సానుకూలతను పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణే కీలకమని గుర్తించి న కేంద్రం ఇందుకు అనువైన విధానాలను ప్రోత్సహిస్తూ వస్తోంది. వీటిలో రాష్ట్రాలవారీగా పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాలలో ఎక్కడ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారో అక్కడే వారికి మౌలిక వసతుల కల్పనకు కృషిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.మొత్తం 20 రాష్ట్రాలు, ఒకేఒక్క కేంద్ర పాలిత ప్రాంతంతో ఉన్న జాబితాలను చూస్తే నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్లే సానుకూల ప్రతికూల అంశాలు గోచరించాయి. ర్యాంకు లు మాత్రమే సరిపోవు ఇందుకు అనువైన వాతావరణం కల్పించాలి. అయితే కొంతలో కొంత ఈ పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు మంచి ర్యాంకులు లభించడం సంతోషించాల్సిన అంశం. అందుకు ఆయారాష్ట్రాల్లోని పాలకప్రభుత్వాలు పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న కార్యాచరణలే కీలకమని చెప్పాలి.నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌రీసెర్చి రూపొందించిన నివేదికలో అత్యుత్తమ రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది.మొత్తం ఆరు అంశాలను ప్రాతి పదికగా తీసుకుని రూపొందించిన జాబితాలో కేంద్ర పాలిత ప్రాంతం దేశ రాజధాని మౌలికవసతుల కల్పన లో తొలిర్యాంకుతో ఉంది. ఇక పెట్టుబడుల పరంగాను, ఆర్ధిక స్థిరత్వం దిశగా గుజరాత్‌ ముందుంటున్న సంగతి తెలిసిందే. ఇక కార్మికరంగ సమస్యలు పరిష్కరించడం లో తమిళనాడు, భూముల సేకరణ, వివాదాల పరిష్కా రంలో మధ్యప్రదేశ్‌లు నిలిచాయి.అయితే భారత్‌లో ఎక్కువ పారిశ్రామికీకకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో మహా రాష్ట్ర,గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు ముందున్నాయి. ఇక గనుల రాష్ట్రంగా పేరుపొందిన జార్ఖండ్‌లో ఇపు డిపుడే ఖనిజవనరుల ఆధారిత ఉత్పత్తిరంగం పుంజు కుంటూ వస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల పరంగాచూస్తే పారిశ్రామిక వృద్ధికి, ఆర్ధికప్రగతికి పోటీపడుతున్నాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడోర్యాంకు సాధిం చింది.మౌలిక వనరులు మరింతగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతోంది.పరిశ్రమలు ఇపుడిపుడే తరలివచ్చేం దుకు అనువైన వాతావరణం కల్పించాలి. అందుకు అను వైన జిల్లాల్లో పారిశ్రామికవాడల పరంగా మరింత కృషి జరగాల్సి ఉంది. ఇక తెలంగాణ పరంగా ఇప్పటికే ఐటి, హెల్త్‌కేర్‌రంగాలకు హబ్‌గా నిలిచింది. వీటితోపాటే ఉత్ప త్తిరంగానికి సైతంమరింత ప్రాధాన్యతనిస్తే ఆర్ధికవృద్ధి పరంగా మరింత పురోగమిస్తుందనే చెప్పాలి. అన్నిరం గాల్లో భారత్‌కు పెట్టుబడులు విస్తరిస్తున్న దృష్ట్యా దేశం లోని అన్ని రాష్ట్రాలను జిఎస్‌టి ఒకేవేదికపైకి తెస్తుం దన్న భావన ఆర్ధికరంగ నిపుణుల్లో వ్యక్తం అవుతున్నది. మౌలికసదుపాయాల కల్పనలో ఢిల్లీ,మహారాష్ట్రలే ఇప్ప టికీ ముందున్నాయి.ఆర్ధిక వాతావరణంపరంగా పశ్చిమ్‌ బంగా 11వ స్థానంలో ఉంటే పరిపాలన రాజకీయ స్థిరత్వంపరంగా కూడా పశ్చిమబెంగాల్‌ కొంత పుంజు కుంది. ఇక మొత్తంగా అన్ని అంశాలపరంగా హరియా ణా ఉన్నతస్థానంలో నిలిచింది. వివిధ అంశాలవారీగా రూపొందించిన ఈ జాబితాలో మరింతగా దృష్టిసారిం చాల్సిన రాష్ట్రాలు ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరా ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ పరంగాచూస్తే ఆర్ధికవాతావరణం మరింత మెరు గుపడాల్సిన అవసరం ఎంతో ఉంది.పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం అవుతున్నా ఇందుకు అనువైన రంగాల్లో మరింతప్రోత్సాహం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికీకకరణ మరింత వేగవంతం అవుతుందని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. పెట్టుబడుల పరంగా విదేశీ సంస్థలయినా దేశీయ ఆర్ధిక సంస్థలైనా ఎక్కువగా మౌలికవనరులు, రాయితీలు అధికంగా లభించే ప్రాం తాలనే కోరుకుంటున్నారు. ఇటీవలికాలంలో రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌వైపు వెళుతున్న సంస్థలు ఇపుడిపుడే ఇతర రాష్ట్రాలవైపు దృష్టి మళ్లిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాష్ట్రం కీలకంగా నిలిస్తే ఇపు డిపుడే ఆ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేరుతు న్నాయి.అయితే ఇందుకు మరింతగా ఈరెండు రాష్ట్రాలు కసరత్తులు చేయాలి.సరళీకృత పారిశ్రామిక విధానం ఎక్కువ ఊతంఇచ్చినప్పటికీ ఆయాపరిశ్రమలు తమతమ కేంద్రాలను ప్రారంభించాయా లేదా అన్నది సమీక్షచేయా ల్సిన అవసరం ఎంతో ఉంది. అనుమతులు మంజూరు నుంచి ఉత్పత్తి, పారిశ్రామిక సంస్థల ప్రగతిపై నిరంతర సమీక్షఉంటేనే పారిశ్రామికప్రగతి పెరుగుతుంది, తద్వా రా పెట్టుబడులు మరింతగా సమకూరుతాయనడంలో ఎలాంటి సందేహంలేదు. గుజరాత్‌,మహా రాష్ట్రలు ముందంజలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి లో ట్రేడింగ్‌ కేంద్రంగా గిఫ్ట్‌సిటీని ఏర్పాటుచేసి గుజ రాత్‌ను ప్రపంచచిత్రపటంలో నిలుపుకున్నది.కొత్తగా అవ తరించిన రాష్ట్రాలతోపాటుదేశంలో పెట్టుబడులకు సాను కూలత అధికంగా కనిపిస్తున్న రాష్ట్రాల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం,అనుమతుల్లో జాప్యంనివారిస్తే భారత్‌కుపెట్టు బడులపరంగా ఎదురుండదని నిష్కర్షగా చెప్పగలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *