Home > Crime > కారులొ మహిళను నిర్బంధించి నగలు,రూ 60 నగదు చోరి

కారులొ మహిళను నిర్బంధించి నగలు,రూ 60 నగదు చోరి

మూడుముళ్లు వేయగానే భార్య గర్భవతని తెలిస్తే..
డీఎస్పీ జేబుకే కన్నం వేశాడు.. 90 వేలు కొట్టేశాడు

Godavarithefs_apduniaతూర్పు గోదావరి జిల్లా   రావులపాలెంమండలం కొమరాజులంక రోడ్డులో శుక్రవారం రాత్రి 11గంటలకు ఒక మహిళ రాజమహేంద్రవరం నుండి రావులపాలెం లో తన సోదరి గృహప్రవేశానికి  కిరాయి కారులోబయలుదేరి రావులపాలెం వస్తున్న నేపధ్యంలో కారు డ్రైవర్ ఆమెను మోసం చేసి డబ్బు, నగలు దోచుకుపోయిన సంఘటన రావులపాలెం లో చోటుచేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం కు చెందిన పొదిలి వెంకట సూర్యకమల రావులపాలెం లో ఉంటున్న తన సోదరి గృహప్రవేశానికి విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం చేరుకొని, అక్కడ నుండి ఆమె రావులపాలెం కారులో బయలుదేరింది కారు రావులపాలెం డిగ్రీ కాలేజీ సమీపం లోకి వచ్చేసరికి  డ్రైవర్ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆమెను కారుతో పాటు బండిరేవుపుంత వైపు మళ్లించి ఆమెను తాడుతో నిర్బంధించి ఆమె వద్దనున్న సుమారు 5 తులాల బంగారం, 60 వేల నగదు సెల్ ఫోన్ దొంగిలించి పారిపోయినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని,దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. విద్యాసాగర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *