Home > Editorial > ముల్లును ముల్లుతోనే తీయాలి….

ముల్లును ముల్లుతోనే తీయాలి….

ఏటా ఐదు వేల మంది పరువు హత్యలకు బలి...
పసుపు బోర్డు కలేనా....

india pakisthan_apduniaనీవు నేర్పిన విద్యనే నీరజాక్షి… అంటూ భారత్ కు పాకిస్తాన్ దీటైన సమాధానం ఇస్తోంది. ఇన్నాళ్లు కొంత ఉపేక్షించిన సైనికులు ముల్లుకు ముల్లే సమాధానం అంటున్నారు.కశ్మీర్‌లోని అధీన రేఖ- లైన్ ఆఫ్ కం ట్రోల్- ఎల్‌ఓసి- దగ్గర పాకిస్తానీ స్థావరాలను భారత సైనికులు ధ్వంసం కొనసాగుతోంది. మన సైనికులు మరోసారి మే తొమ్మిదవ తేదీన జరిపిన సాయుధ చికిత్స సర్జికల్ స్ట్రయి కాదు. నేరస్థులను న్యాయస్థానం దండించడం నేర నిరోధక చర్య మాత్రమే, ప్రతీకారం కాదు. పాకిస్తాన్ సైనికులుగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న ఉగ్రవాదులు 2013లో నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మృతదేహాలను ముక్కలు చేసే పైశాచిక కృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. 2013 జూన్‌లో రేఖను దాటి చొరబడిన పాకిస్తానీ సైనికుల ముసుగులో హేమరాజ్, సుధాకర్ సింగ్ అనే మన సైనికులను చాటుమాటుగా దాడి చేసి చంపారు. యుద్ధం జరగడం లేదు, అందువల్ల చాటుమాటుగా హత్య చేయడం బీభత్స కలాపం. అలా హత్య చేసిన సుధాకర్ సింగ్ మృతదేహాన్ని ముక్కలు చేశారు, హేమరాజ్ తల నరికి తీసుకొని వెళ్లి పాకిస్తాన్‌లో ఊరేగించారు. తమ పాశవిక విజయాన్ని చాటుకున్నారు. అప్పుడు మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపింది. పాకిస్తాన్ వెక్కిరించింది. నేర నిరోధక సాయుధ ప్రక్రియకు పూనుకోలేదు.రేఖ వద్ద వెలసిన పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేయలేదు. విధానం పాకిస్తాన్‌కు మరింత దురహంకారాన్ని కలిగించింది.నిరంతరం అధీనరేఖను దాటి చొరబడుతున్న జిహాదీ ఉగ్రవాదుల స్థావరాలను, వారిని ఉసిగొల్పుతున్న టెర్రరిస్ట్స్ ఇన్ డిస్‌గైజ్- పాకిస్తానీ సైనికుల స్థావరాలను సైనికులు ధ్వంసం చేయడం అందువల్ల ప్రతీకార చర్య అనిపించుకోదు. ఇలా ధ్వంసం చేయడం నేర నిరోధక సాయుధ ప్రక్రియ- ప్యునిటివ్ ఫైర్ అస్సాల్ట్- మాత్రమే. ఆవుల మందలలోకి చొరబడి గొంతులను కొరికే తోడేళ్లను అంతం చేయడం ప్రతీకారం కాదు. పాకిస్తాన్ మన దేశంపై యుద్ధం ప్రకటించి నియమబద్ధంగా దాడులు చేసినట్లయితే జరిపే ఎదురుదాడులు ప్రతీకారానికి ప్రతీకలు కావచ్చు.అధీన రేఖ దాటి వచ్చి మన సైనికులను, ప్రజలను చాటుమాటుగా మట్టుపెట్టి పారిపోతున్న జిహాదీ ఉగ్రవాదులు పిశాచాల వంటివారు. సైనికులు అధీన రేఖ వద్ద పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేయడం నేర నిరోధక సాయుధ ప్రక్రియ మాత్రమే. ప్రతీకారం కాదు. ఈ పాకిస్తానీ స్థావరాలు జిహాదీ ఉగ్రవాదులవి, పాకిస్తాన్ సైనికుల రూపంలోని ప్ర చ్ఛన్న ఉగ్రవాదులవి. వాస్తవానికి పాకిస్తాన్‌లో సైనికులు లేరు. ఎందుకంటే సైనికులు మరణించిన శత్రుదేశ సైనికుల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరకరు, తలలను ఖండించి పైశాచికంగా వాటిని ప్రదర్శించరు. కానీ పాకిస్తాన్ సైనికులుగా చెలామణి అవుతున్నవారు మన సైనికుల పార్థివదేహాలను నరుకుతున్నారు, తలలను తెగ వేస్తున్నారు. ఇలా చేయడం అమానవీయ, పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం. పాకిస్తాన్‌లోని సైనికులు నిజానికి జిహాదీ ఉగ్రవాదులు. రెండురకాల ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ప్రత్యక్ష ఉగ్రవాదులు మొదటి రకం, లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్‌దావా, జాయిష్ ఏ మొహమ్మద్, తాలిబన్ వంటి ముఠాలలో ఈ జిహాదీ హంతకులు సభ్యులు. రెండవ రకం ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు. వీరు ప్రచ్ఛన్న ఉగ్రవాదులు..పైశాచిక నేరస్థులను దండించడంలో భాగంగానే మే తొమ్మిదవ తేదీన సైనికులు పాకిస్తానీ స్థావరాలను ధ్వంసం చేశారు. పాకిస్తానీలు మన జవానులను ఎదుర్కొనలేక తోకలను ముడుచుకొన్న తోడేళ్ల వలె పారిపోయారు. సైనిక దళాలు ఇలా తమ దేశంలోని ఈ నియంతలు ప్రధానంగా సైనిక అధికారులు. సైనిక అధికారుల అదుపాజ్ఞల్లో పనిచేస్తున్న ‘నాగరిక’ ప్రభుత్వం ‘అనాగరిక’ పద్ధతుల్లో ఈ మన ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- లు జరగలేదని బుకాయిస్తోంది. 2016 సెప్టెంబర్‌లో మన దళాలు ‘రేఖ’దాటి వెళ్లి ఉగ్రవాదుల అడ్డాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని అంగీకరించలేదు. మే తొమ్మిదవ తేదీన మన ప్రభుత్వం మూడోసారి జరిపిన చికిత్స ను పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ దాడులను మన ప్రభుత్వం వీడియో తీసి విడుదల చేసింది. తాము కూడ భారత సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు పాకిస్తాన్ నకిలీ వీడియోను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com