Home > Bhakti > రాహుకేతు పూజా టికెట్ల ధర రూ. 500కి పెంపు

రాహుకేతు పూజా టికెట్ల ధర రూ. 500కి పెంపు

ఘనంగా సిరిమాను సంబరాలు
తిరుమలకు భక్తుల పోటు

rahu-ketu-pooja-apdunia-శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులపై భారం

రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ పూజలకు విశేష ఆదరణ ఉంది. ఇంతవరకు సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న రూ.300 టిక్కెట్టును రూ.500 కు అధికారులు పెంచేసారు. ఉన్నతాధికారుల ఆమోదం కూడా పొందడంతో వెంటనే రాత్రికి రాత్రే రూ. 500 ఏకంగా అమలుచేశారు రాహు, కేతు సర్పదోష నివారణ పూజల కోసం భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడి ఆలయానికి వస్తుంటారు. ఇందుకు అవసరమైన వెండి నాగపడగలతో పాటు పూజా సామగ్రి మొత్తాన్ని ఆలయం తరఫున అందుబాటులో ఉంచుతున్నారు. పూజలు శీఘ్రంగా చేసుకోవడంతో పాటు భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఇక్కడ రూ.300, రూ.750, రూ.1500, రూ.2500, రూ.5 వేలు ధరలతో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.300 టిక్కెట్టు అన్నది సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేశారు. గతంలో వున్న రూ.250 టికెట్ యాభై రూపాయలు పెంచి రూ.300 చేశారు. ఇప్పుడు ఏకంగా రూ.300 టిక్కెట్టును రూ.500 చేయాలని అధికారగణం నిర్ణయించింది. ధర్మకర్తల మండలి ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనలు రాగా అప్పట్లో వారు వ్యతిరేకించడంతో ధరలు పెంపుదల అమలు కాలేదు. ప్రస్తుతం ‘మండలి’ పదవీ కాలం పూర్తయిన తరవాత ఆలయ అధికారులు . ఈ పూజా టిక్కెట్ల ధరలను పెంపుదల చేయాలని అధికారగణం నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. ఇప్పటికి అన్నీ ఆర్జిత సేవా టిక్కెట్లు పెంపుదల చేసినప్పటికి.. సామాన్య భక్తులకు రాహు, కేతు పూజలు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఈ టిక్కెట్టును పెంచలేదు. ప్రస్తుతం ధరను ఒకేసారి రూ. 500 పెంచడంతో ఈ నిర్ణయం మాత్రం.. సామాన్య భక్తులపై పెను భారం పడింది. ఆలయంలో జరిగే రాహు, కేతు పూజల్లో అత్యధిక టిక్కెట్లు విక్రయించేది.. రూ.300 పూజలకే. ఎక్కువ మంది భక్తులు ఈ పూజలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రోజుకు సరాసరిన 3 వేలు పూజలు జరిగతాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలంటే.. ఎక్కువగా అమ్ముడుపోయే టిక్కెట్ల ధరలు పెంపుదల చేస్తే ఆదాయం మరింతగా పెరిగే అవకాశముందని అధికారుల అలోచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com