Home > Bhakti > పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!
బ్యాంక్ లో స్వామి వారి బంగారం 2,780 కిలోలు

padmavati-amma-apduniaతిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో అమ్మవారి ఆలయంలో భక్తులవల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగిన దోషాలకు పరిహారంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్చకులు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, పవిత్ర విసర్జనం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరిపైనా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈవో ఆకాంక్షించారు.

వైభవంగా చక్రస్నానం
మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్ళతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *