Home > Tirumala News > అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తిరుమల

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తిరుమల

టీటీడీ ఛైర్మన్ రేసులో నందమూరి హరికృష్ణ
శ్రీవారూ పన్ను చెల్లించాల్సిందే

ttd temple_apduniaపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నియమనిష్టలతో స్వామివారిని దర్సించుకోవడానికి వస్తుంటే స్థానికంగా ఉండే వ్యవహారాలు వారిని కలచివేస్తున్నాయి. అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా వర్థిల్లుతున్న తిరుమలలో మద్యం, మాంసంతో పాటు గుట్కా, సిగరెట్ ఇలాంటివి పూర్తిగా నిషేధం విధించారు. కానీ అడ్డదారుల్లో ఇవన్నీ కొండమీదకు యథేచ్ఛగా చేరుతున్నాయనడానికి అనేక సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గోవిందా..గోవిందా అంటూ చమటోచ్కుకుంటూ ఏడుకొండలు ఎక్కే భక్తులు తనివితీరా స్వామివారిని చూసి పరవశానికి లోనవుతారు. కానీ రాను రాను ఆ పరిస్థితులు కనిపించడం లేదు తిరుమలలో. ఎంతో కష్టపడి కొండకు వచ్చే భక్తుడికి క్షణకాలం పాటు కూడా దైవ దర్సనాన్ని కూడా కల్పించలేని టిటిడి అసాంఘిక శక్తులను అడ్డుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే కొండపై ఎన్నో అరాచకాలు వెలుగుచూసినా అప్పటికప్పుడు హడావిడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనడంలో టిటిడి అధికారులు విఫలమవుతున్నారు. మద్యం, మాంసం, గుట్కా, సిగరెట్ లాంటి వస్తువులు పూర్తిగా కొండపై నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా వాటిని అమ్ముతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కొండ పవిత్రతను కాపాడడం కోసం వందల సంఖ్యలో పారిశుధ్య కార్మికులు నిత్యం పనిచేస్తూ ఉంటారు. ఆరుబయట ఎక్కడ ఉమ్మివేయకూడదంటూ టిటిడి రాసే సూచికలను భక్తులు మనసా వాచా పాటిస్తుంటారు. కానీ కొండపైనే తిష్టవేసిన కొందరు వ్యక్తులు మాత్రం ఈ నియమాలన్నింటినీ గాలికొదిలేస్తున్నారు. తిరుమలలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల కారణంగా మరోసారి పెద్ద చర్చకు తెరలేచింది. మొన్నటికి మొన్న ఒక చిన్నారి సవతి తల్లి అడవిలోకి తీసుకెళ్ళి చంపేవడం అక్కడున్న భక్తులకు ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్నటికి నిన్న మరో బాలుడు కిడ్నాప్ కు గురికావడం ఆందోళనను కలిగిస్తోంది. నేడు అదే కొండపై నిషేధిత వస్తువులైన మద్యం బాటిళ్ళు లభించడంతో కొండపై భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. చీమ చిటుక్కుమంటే అప్రమత్తమయ్యే పోలీసులు, నిత్యం కొండపైకి వచ్చే భక్తులపై ఒక కన్నేసి ఉంచే నిఘా వ్యవస్థ ఇప్పుడు నిద్రపోతున్నట్లు ఉన్నాయి. అందుకే వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *