Home > Bhakti > కొత్త యేడాది రద్దీకి తిరుమల సిద్దం

కొత్త యేడాది రద్దీకి తిరుమల సిద్దం

ఆలయాలను ఉచితంగా దర్శించుకునే 'దివ్యదర్శనం' పథకం ప్రారంభం
దశావతారాల్లో కనిపించనున్న భద్రాద్రి రామయ్య
tirumala-ttd-apduniaతిరుమల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. నిత్యం లక్షల్లో భక్తులు తిరుమల వస్తుంటారు. ఇక్కడికి వచ్చి కోరిక కోరుకుంటే చాలు స్వామి తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక ఏడాదిలో తొలిరోజున స్వామివారి దర్శించుకుంటే ఆ ఏడాదంతా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏడాదిలో తొలిరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు భక్తులు. ఇక ఆరోజున స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో స్వామివారి ప్రసాదం తీసుకుని ఆలయం వెలుపల వచ్చిన తర్వాత స్వామివారి కేలండరు, డైరీ తీసుకుని తమ స్వస్ధలాలకు చేరుకుంటారు భక్తులు.  ఈ భక్తివిశ్వాసాల  వల్లే ప్రతి ఏడాది ఆంగ్ల సంవత్సరాది రోజున పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు. ఇక ఈ ఏడాది జనవరి 1  ఆదివారం రావడంతో…ఈ రోజు అందరికి సెలవు దినం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తిరుమల వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు జనవరి 3 వతారీఖున తిరుపతిలో సైన్స్ కాంగ్రెసు సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపద్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీతలు,శాస్త్రవేత్తలు, ప్రముఖులు ముందుగానే తిరుపతి చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారు నూతన సంవత్సరం రోజు దర్శనం చేసుకునేలా తమ స్ధాయిలో తాము ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో నూతన సంవత్సరం రోజున తిరుమల వచ్చిన అందరికి దర్శనం చేయించడం టీటీడీకి సవాలుకానుంది.
 
ఇక ప్రతీ ఏడాది చెప్పినట్టే ఈ ఏడాది కూడా  సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ రోజున ప్రోటోకాల్ విఐపీ దర్శనాలు మినహా అన్ని రకాల విఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక ప్రోటోకాల్ విఐపీలు వచ్చిన పక్షంలోనే దర్శనం చేయించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక జనవరి 1 వతేదీన ఉదయం 4 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించేలా టీటీడీ అధికారులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో. దాతలు, వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది. కాలినడకన వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు, క్యూలైన్లు అందుబాటులో ఉంచేలా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ క్యూలైన్ లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని కంపార్ట్మెంట్లతో పాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేయానున్నారు అధికారులు.
 
ఇక సైన్స్ కాంగ్రెసుకు వచ్చే విఐపీలకూ ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే టీటీడీ అధికార్లను ఈఓ సాంబశివరావు ఆదేశించారు. ఈ నేపద్యంలో విఐపీలకు అద్దెగదులకు అందుబాటులో ఉంచేలా టీటీడీ ఏర్పాట్టు చేస్తుంది. దీంతో సామాణ్య భక్తులకు అద్దెగదులు లభ్యత తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీంతో భక్తులకు అందుబాటులో ఉండేలా పీఏసీలను టీటీడీ సిద్దం చేస్తుంది. పీఏసీలో వసతులు సిద్దంగా చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం టీటీడీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక వరుసగా వీఐపీలు వస్తున్న నేపద్యంలో తిరుమలలో భద్రతను పెంచారు. అలిపిరిలో భద్రతాను కట్టు దిట్టం చేశారు. ఇక తిరుమలలోనూ డాగ్ స్కాడ్…బాంబా స్కాడ్ తనిఖీలను ముక్కరం చేశారు. ఇక భక్తులకు లడ్డూలూ అందుబాటులో ఉంచేలా లడ్డూ నిల్వ లను అందుబాటులో ఉంచుకుంటుంది టీటీడీ. ఇక అద్దెగదులు సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు తెలియచేయాల్సిందిగా బ్రాండ్‌కాస్టింగ్‌ విభాగం పనిచేయాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇక జనవరి 1న డైరీలు…క్యాలెండర్లు కొనుగోలు చేయాడాన్ని భక్తులు సెంటిమెంటుగా భావించే నేపద్యంలో డైరీలు క్యాలెండర్లు వివరాలు భక్తులకు తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సింది గా పిఆర్వో కార్యాలయ అధికారులను ఈఓ సాంబశివరావు ఆదేశించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *