Home > Editorial > ఐటీడీఏ పాలనలతో కొరవడతున్న ట్రాన్స్ పరెన్సీ

ఐటీడీఏ పాలనలతో కొరవడతున్న ట్రాన్స్ పరెన్సీ

ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విజయ్ మాల్యా
తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం

ITDA_Schemes_apduniaఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలెప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐటీడిఎ)ల పాలనలోనే పారదర్శకత లోపించింది. మరో వైపు పాలక మండళ్ల సమావేశాల నిర్వహణ లేకపోవడంతో… పాలన అస్తవ్యస్తంగా మారింది. సమగ్ర గిరిజనాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఐటిడిఎలు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు సహా మైదాన ప్రాంతాలతో కలిపి 13 జిలాల్లో మొత్తం తొమ్మిది ఉన్నాయి. జిల్లాల వారీగా అవి సీతంపేట (శ్రీకాకుళం), పార్వతీపురం (విజయనగరం) పాడేరు (విశాఖపట్నం), రంపచోడవరం (తూర్పు గోదావరి ), కెఆర్‌పురం ( పశ్చిమ గోదావరి), శ్రీశైలం వద్ద సున్నిపెంట (కర్నూలు), నెల్లూరు ( నెల్లూరు) సహా మైదాన ప్రాంతాల గిరిజనుల కోసం విజయవాడలోనూ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చింతూరు కేంద్రంగా మరో ఐటిడిఎను కొత్తగా ఏర్పాటు చేశారు. పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, కెఆర్‌పురం ఐటిడిఎల్లో ప్రాజెక్టు అధికారులుగా (పిఒలుగా) ఐఎఎస్‌ అధికారులు, సీతంపేట, నెల్లూరు, చింతూరు, నెల్లూరు, శ్రీశైలం, విజయవాడల్లో రెవిన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను పిఒలుగా నియమించారు. మైదాన ప్రాంత ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించిన నెల్లూరు, విజయవాడల్లోని ఐటిడిఎల్లో ఏడాదికి రెండు పర్యాయాలు, మిగిలిన ఆరు ఐటిడిఎల్లో నాలుగుసార్లు చొప్పున పాలకమండళ్ల సమావేశాలను ఆయా జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన పివోలు నిర్వహించాల్సి ఉంటుంది.ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీల సభ్యులు, మండల పరిషత్తుల అధ్యక్షులు ఈ మండళ్ల సభ్యులుగా ఉంటారు. ఈ పాలక మండళ్ల సమావేశాల్లో ఆయా ఐటిడిఎల పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ, వైద్య, విద్య, రెవిన్యూ తదితర శాఖల అధికారులంతా పాల్గొనాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలపై మండళ్లు చర్చించాలి. గిరిజనుల కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, అవి గిరిజనులకు ఏమేరకు చేరుతున్నాయి తదితర అంశాలను పాలక మండలి చర్చించి, లక్ష్యాల సాధనకు అనుగుణంగా యంత్రాంగాన్ని నడిపించేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గిరిజనుల అభివృద్ధికి కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలనూ ఐటిడిఎలు ప్రతిపాదించే వీలుంది. సమావేశాలే సరిగా లేకుండా, ఉన్నా మొక్కుబడి చందంగా మారినా ఐటిడిఎలకు సరైన దిశానిర్దేశం లేనట్టే అవుతుంది.గత ఏడాది 2016లో గిరిజన ప్రాంతాల ఆరు ఐటిడిఎల్లో మొత్తం 24 సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, కేవలం అయిదే సమావేశాలు నిర్వహించారు. అవి సీతంపేట, పాడేరుల్లో రెండేసి, కేఆర్‌పురంలో ఒక సమావేశం ఉన్నాయి. పార్వతీపురం, రంపచోడవరం, శ్రీశైలం ఐటిడిఎల్లో ఒక్క సమావేశమైనా నిర్వహించలేదు. మైదాన ప్రాంతాల రెండు ఐటిడిఎల్లో 2016లో నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా కేవలం చెరొకటి రెండే సమావేశాలు వేశాయి. గిరిజన ప్రాంతాల్లో అధికార పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తక్కువగా ఉన్నందునే ఈ సమావేశాలను నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *