Home > Politics > కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ

కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ

వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా....
అవినాష్ వర్సెస్ షర్మిల

kodandaram-apduniaప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ స్థాపించడం వల్ల ఏ పార్టీకి మేలు జరుగుతుంది?, ఎవరి ఓట్లు చీల్చగలరు?, రాజకీయ పార్టీగా ఆవిర్భవించే శక్తి, సామర్థ్యాలు ఎంత వరకు ఉన్నాయి?, అసలు నిలదొక్కుగలదా?, గతంలో లోక్‌సత్తా పేరిట జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన పార్టీ ఇప్పుడు ఏమైంది?ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ పెడతామంటే టిఆర్‌ఎస్ భయపడాలి కానీ, సంతోషిస్తున్నది. అదేమిటీ? అంటే తమ ప్రభుత్వం పట్ల ఉన్న కొద్దిగో గొప్ప వ్యతిరేకతను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వెళితే ఆ పార్టీ కొంత వరకు బలపడుతుంది కాబట్టి, ఆ వ్యతిరేక ఓట్లలోనూ ‘చీలిక’ తెచ్చేందుకు ప్రొఫెసర్ పార్టీ ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు అంఛనా వేస్తున్నారు పార్టీగా ఆవిర్భవిస్తే టి.జెఎసి భవిష్యత్తు ఏమిటీ?, ఆ తర్వాత టి.జెఎసి ఉంటుందా? ఉండదా? ఇలా ఎనె్నన్నో సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మళ్లీ ఎన్నికల వరకూ కొంతైనా వ్యతిరేకత చేకూరుతుంది. ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టినా, అన్ని వర్గాలనూ సంతృప్తిపరచడం కష్టం కాబట్టి కొంతైనా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను సాధారణంగా కనీసం 5 శాతంగా లెక్కిస్తుంటారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ఎంత వ్యతిరేకత ఉందనేది ఇప్పుడు లెక్క కట్టలేం. అయితే ఆ వ్యతిరేక ఓట్లనే ప్రొఫెసర్ కోదండరామ్ ఆకర్షించగలరా? అనేది ప్రశ్న. అలాగైతే ఆ వ్యతిరేక ఓట్లు ప్రొఫెసర్ నేతృత్వంలోని కొత్త పార్టీకే వెళ్ళాలన్న గ్యారంటీ ఏముందీ?, మిగతా ప్రతిపక్షాల సంగతేమిటీ?. అందునా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, మిగతా ప్రతిపక్షాలు బిజెపి, టిడిపి, వామపక్షాలు ఉన్నాయి.లోగడ టి.జెఎసిని రాజకీయ పార్టీగా మార్చాలని అడ్వకేట్ ప్రహ్లాద్ పట్టుబడితే, ఆయన్ను తీవ్రంగా మందలించడం జరిగింది. టి.జెఎసి రాజకీయ పార్టీ కాదని, కేవలం ఉద్యమ సంస్థ అని ఇంత వరకూ చెబుతూ వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నఫళంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చినట్లు? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.ప్రొఫెసర్ కోదండరామ్ ఎప్పుడైనా వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గానైనా గెలుపొందారా? అని టిఆర్‌ఎస్ నాయకులు అనేక సార్లు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీ పెట్టడం ద్వారానే తాను ఏమిటో, తన సత్తా ఏమిటో, నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ స్థాపిస్తే ఆయన వెంట వచ్చేదెవరూ? అనే చర్చ జరుగుతున్నది. వివిధ పార్టీల్లోని అసంతృప్తివాదులు, చివరకు తమకు పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కదు అనుకునే వారు, లేదా చట్ట సభలకు పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనుకునే వారు ఆయన పార్టీలో చేరేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ వెంట విద్యార్థి లోకం ఏ మేరకు కదులుతుందనేది ప్రధాన ప్రశ్న. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కదులుతారా? వారిలో కూడా టిఆర్‌ఎస్ వైపు, బిజెపి, కాంగ్రెస్ వైపు వెళ్ళేందుకు చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలూ యువజన, విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసుకుని, వివిధ ఆందోళన కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేస్తున్నాయి.ఇకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలలోగా అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు పెరుగుతాయన్న ప్రచారం ఉంది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ సీట్ల సంఖ్య పెంపుదలపై ఆశలు ఉన్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. నిజంగానే సీట్ల సంఖ్య పెరిగితే 153 అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎలా దించగలరు?, ఒకవేళ వివిధ పార్టీల నుంచి చేరే మాజీ ఎమ్మెల్యేలనో, ఇంకా విద్యార్థి నాయకులనో ఎన్నికల ‘బరి’లోకి దించినట్లయితే, ఆ స్థానాల్లో వారు ఎంత వరకు నిలదొక్కుకోగలరు?, ఓట్లు చీలకుండా ఉండేందుకు అవతలి పార్టీ నేతలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా ఉండగలరా?, ఒకవేళ నిలబడినా, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటీ?, ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలను తట్టుకోవడమే కాకుండా ఆర్థికంగా ఎలా తట్టుకుంటారు?, పార్టీ తరఫున ప్రొఫెసర్ కోదండరామ్ అభ్యర్థులకు ఆర్థిక బలం ఇవ్వగలరా?, ఆయనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి?, కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిలో ఎంత మంది ప్రొఫెసర్ కోదండరామ్‌కు అండగా నిలబడి ఆర్థికంగా సహాయపడతారు? వీటన్నింటికీ సమాధానం దొరకాలి.మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి నిలదొక్కుకోలేక చివరకు కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేయక తప్పలేదు. అంతకు ముందు నాదెండ్ల భాస్కర రావు, మాజీ డీజిపి భాస్కర రావు, లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ప్రయోగాలు చేసి చతికిలపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఒక ఎన్నికల వరకూ కొంత వరకు పోటీ ఇవ్వగలిగినా, ఆ తర్వాత కొనసాగించగలరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ స్వతహాగా పోటీ చేయలేక, ఏదైనా ఫ్రంట్‌తో కలిసి పోటీ చేస్తారేమోనని వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *