Home > Politics > ఎన్నికలకు గులాబీ కసరత్తులు

ఎన్నికలకు గులాబీ కసరత్తులు

నీటి సమప్య తీరినతరువాతే ఓట్లు అడుగుతా : లోకేష్
లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి

kcr-telangana-apduniaఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎదరవుతున్న వైఫల్యాలపై మొదట అంతర్మథనానికి ఆ పార్టీ సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. భారీ ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నప్పటికి ప్రజల నుండి ఆశించిన మేర స్పందన రాకపోతుండడం పట్ల ఆ పార్టీ సీరియస్‌గా పరిగణిస్తుందంటున్నారు. పార్టీ అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తూ వ్యతిరేక ధృక్పథాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న అంశాన్ని సైతం టిఆర్‌ఎస్ పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలు పార్టీకి ఆశించిన మేరకు ఫలితం ఇవ్వలేదంటున్నారు. ఈ సర్వేలతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా నిర్వహించిన సర్వేల ఫలితాలు సైతం భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ముందస్తు అప్రమత్తత చర్యలు తీసుకోవాలని సిఎం నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ పరంగా అన్ని అంశాలపై అంతర్మథనం జరిపేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు గాను మెజార్టీ సెగ్మెంట్లలో టిఆర్‌ఎస్‌కు ప్రతికూలత ఉన్నట్లు ప్రైవేట్ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయంటున్నారు. దీనికి తోడుగా ముఖ్యమంత్రి స్వీయ సర్వేలు సైతం ఇదే అంశాన్ని రూడి చేస్తుండడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలవైపు అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి అధికార పార్టీలో గ్రూప్ తగదాలు, అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్న అంశాన్ని అదిష్టానం పసిగట్టినట్లు చెబుతున్నారు. పనులు, పదవులు లేక అధికార పార్టీ శ్రేణులందరూ తీవ్ర నిరాశ, నిస్పృహలోకి జారుకుంటున్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ అంశాన్ని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తనకు అనుకూలంగా మలుచుకుంటూ వారందరిని తమ పార్టీవైపు ఆకర్షిస్తోంది. దీనికి తోడుగా స్థానిక ఎంఎల్‌ఎలపై కూడా ఆరోపణలు రావడం అలాగే వారు ప్రజలకు క్రమంగా దూరం అవుతుండడం అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఆందోళన రెకెత్తిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్‌ఎలందరితో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశంలో బలం, బలహీనత, లోటుపాట్లపై లోతుగా చర్చించడమే కాకుండా ఎంఎల్‌ఎలందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్ సరైన దిశానిర్దేశం చేయబోతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలను లక్షంగా చేసుకొని ఎదురు దాడికి అధికార టిఆర్‌ఎస్ పార్టీ సిద్దం కాబోతున్నట్లు పేర్కొన్నారు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com