Home > Bhakti > ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

ఇక సర్వదర్శనానికి స్లాట్స్
శబరిమలలో నిత్యాన్నదానం

ttd-calenders-apduniaటిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలు, ముఖ్య నగరాల్లో క్యాలెండర్లు, డైరీలను ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. పలువురు భక్తుల కోరిక మేరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. టిటిడి క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో బుక్ చేసి నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు పోస్టల్ ద్వారా పంపే అవకాశాన్ని భక్తులకు కల్పించామన్నారు. భక్తులు టీటీడీసేవాఆన్ లైన్ డాట్ కామ్ వెబ్సైట్లో ”పబ్లికేషన్స్”ను క్లిక్ చేసి డెబిట్కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా పోస్టల్ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. క్యాలెండర్, డైరీలను చేర్చినందుకు గాను ఎంఆర్పి ధరతోపాటు పోస్టల్ చార్జీలను భక్తులు చెల్లించాల్సి ఉంటుందని, లక్షలాది మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com