Home > Bhakti > ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

భక్తులపై భారం వద్దు
అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం

anil-kumar-singhal-apduniaతిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. శుక్రవారం నాడు అయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గోన్నారు.

అక్టోబరు 18, 25వ తేదీల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తాంమని అన్నారు. 2018వ సంవత్సరానికి గాను టిటిడి 20 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 12 లక్షల డైరీలు శ్రీవారి పెద్దక్యాలెండరు, శ్రీపద్మావతి మరియు శ్రీవారి క్యాలెండరు, తెలుగు పంచాంగం క్యాలెండర్ కలిపి మొత్తం 17 లక్షలు ముద్రించడం జరిగిందని ఈవో వెల్లడించారు. త్వరలో దశలవారీగా కన్నడ, తమిళం, హిందీ భాషల్లో వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయన అన్నారు.

గోవింద మొబైల్ యాప్లో ఇదివరకే టిటిడి ఆర్జిత సేవాటికెట్లు, వసతి బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి సుందరీకరణ పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నవంబరులో పనులు ప్రారంభిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *