Home > Editorial > ఆగస్టా ల్యాండ్ డొంక కదులుతోంది….

ఆగస్టా ల్యాండ్ డొంక కదులుతోంది….

చివరి అంకానికి చేరుకున్న పార్లమెంట్
ప్రణాళికలు సరే... ఆచరణ ఏదీ....

tyagi-agasta-apduniaఅగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం తీగ లాగితే డొంక కదులుతోంది. కేసులో భారత వైమానిక దళం మాజీ చీఫ్‌ త్యాగి అరెస్ట్‌ తీవ్ర సంచలనం కలిగించింది. రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ త్యాగి 2004 నుంచి 2007 వరకూ భారత వైమానిక దళాధిపతిగా ఉన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్టప్రతి, ప్రధాని, ఇతర వీవీఐపీల కోసం 12 సమర్థవంతమైన హెలికాప్టర్లను కొనుగోలు చేయా లని ప్రభుత్వం సంకల్పించింది. ఆ హెలికాప్టర్లు ఏయే ప్రమాణాలతో ఉండాలి, ఎన్ని ఇంజన్లు ఉండాలి, హెలికాప్టర్‌ సర్వీస్‌ సామర్థ్యం ఏమేరకు ఉండాలో సిఫార్సు చేయాల్సిందిగా అప్పటి రక్షణ శాఖ వైమానిక దళాన్ని కోరింది. వైమానిక దళం సిఫార్సుల మేరకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్లు సమర్థవంతమైనవిగా నిర్ణయించారు. 2010లో ఆంగ్లో ఇటాలియన్‌ కంపెనీ ఫిన్మెకానికాతో రూ. 3,727 కోట్ల రూపాయలకు వీటిని కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. వీవీఐపిలను తరలించే హెలికాప్టర్లు 6 వేల మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం కలిగి ఉండాలని భావించారు. హెలికాప్టర్లు సరఫరా చేసేందుకు అంతర్జా తీయంగా పలు సంస్థలు పోటీ పడ్డా యి. అయితే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థ తయారు చేసే హెలికాప్టర్లు ఆరు వేల మీటర్ల ఎత్తు ఎరిగే సామర్థ్యం కలిగినవి కావు. దీంతో అప్పటి వైమానిక దళ చీఫ్‌గా ఉన్న త్యాగీ వీవీఐపీ హెలికాప్టర్ల సర్వీస్‌ సీలింగ్‌ను 4,500 మీటర్లకు తగ్గిస్తూ ఎయిర్‌ ఫోర్స్‌ నిపుణుల కమిటీ సిఫార్సు చేసే విధ ంగా తన పలుకుబడి ఉపయోగించి మార్పించారన్నది సీబీఐ ఆరోపణ. 2005 మే, 2006 సెప్టెంబర్‌ల మధ్యే ఈ మార్పు చోటు చేసుకుంది. ఆ విధంగా చేయడం ద్వారాఈ హెలికాప్టర్ల సరఫరాకు అగస్టా సంస్థ అర్హత సాధించే విధం గా త్యాగి చేయగలిగారు. నిజానికి త్యాగీ వైమానిక దళ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందే 2004లోనే త్యాగి బంధువులు అగస్టా హెలి కాప్టర్ల సంస్థ కు చెందిన మధ్యవర్తులతో సంప్రదింపులకు పూనుకున్నారని సీబీఐ ఆరోపణ. ఎస్‌పి త్యాగి కూడా ఐఏఎఫ్‌ చీఫ్‌ హోదాలో ఉండగానే హెలికాప్టర్ల తయారీ సంస్థ ఫిన్మెకానికాలోని ఉన్నతాధికారులును కలిశారని కూడా సీబీఐ ఆరోపించింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తులు ముడు పులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో 2013లో ఒప్పందాన్ని రద్దు చేసారు. అప్పటికే మూడు హెలికాప్టర్లను ఆ సంస్థ భారత వైమానిక దళానికి అందజేసింది. 2013లోనే త్యాగి, మరో 13 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2007లో రిటైర్‌ అయిన ఎస్‌పి త్యాగిని, సంజీవ్‌ త్యాగి, గౌతమ్‌ ఖైతాన్‌ లను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి ప్రశ్నిస్తే, త్యాగీ తాను ఎలాంటి అక్ర మాలకు పాల్ప డలేదనే వాదిం చారు. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల విషయం సర్వీ స్‌ సీలింగ్‌ను తగ్గించాలని తీసుకు న్న నిర్ణయం వివిధ శాఖల ఉమ్మడి నిర్ణయంగా సమర్థించు కోవడం విశేషం. అయితే పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు పక్కాగా నిర్ధారించు కునే ఈ అరెస్ట్‌లు చేసినట్లు సీబీఐ వర్గాలవారు పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల తయారీ సంస్థ ఈ ఒప్పందం కోసం మధ్యవర్తులకు రూ. 452 కోట్ల రూపా యలు చెల్లించింది. మొత్తం ఒప్పందం విలువలో ఇది 12 శాతం. ఆ 452 కోట్ల రూపాయలలో భారతీయ అధికారులకు అందిన మొత్తం 414 కోట్ల రూపాయలు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2012 ఫిబ్రవరి 24న ఇటలీ అటార్నీ జనరల్‌ ఫిన్మెకానికా హెలికాప్టర్ల ఒప్పందంలో అక్రమాలపై విచారణ చేపట్టారు. అదే సమయంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థ తరఫున ఒప్పందం ఖరారయిన తరువాత 51 మిలియన్‌ యూరోలు అందుకున్న మధ్యవర్తి గైడో రాల్ఫ్‌ హస్కెల్‌ను అరెస్ట్‌ చేశారు. భారతదేశంతో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కోసం 360 కోట్ల రూపా యలు లంచం ఇచ్చారనే ఆరోపణపై 2013 ఫిబ్రవరిలో ఫిన్మెకానికా కంపెని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, చైర్మన్‌ గుసెప్పీ ఓర్సీలను అరెస్ట్‌ చేశారు. వెంటనే భారత దేశం స్పందించింది. అప్పటి రక్షణ మంత్రి ఎకె ఆంథోనీ లంచాల ఆరోపణపై విచారణకు ఆదేశించారు. అప్పటికే ఒప్పందం మొత్తంలో 45 శాతం అంటే రూ. 1,620 కోట్లను అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థకు చెల్లించారు. మూడు హెలి కాప్టర్లు భారత వైమానిక దళంలో చేరాయి. ఎస్‌పి త్యాగి బంధువుల ఆస్తుల జప్తుకు ఇడి చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇటలీ కోర్టు తీర్పు పుణ్యమా అని ఫెన్మికానికా కంపెనీ చైర్మన్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎస్‌.పి. త్యాగి ఆయ న కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని ఇటలీ కోర్టు అధిక్షేపించింది. వారి అరెస్ట్‌ కు ఆదేశాలు ఇవ్వలేదు. అంతే కాక భారత ప్రభుత్వం (యూపిఏ-2) ఇటలీ ప్రాసిక్యూటర్లకు తగిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని కూడా తప్పుపట్టింది. ఈ ఒప్పందంతో ప్రమేయం ఉన్న మధ్యవర్తుల కేసు లను విచారించిన మిలన్‌ కోర్టు డాక్యుమెంట్లలో మధ్యవర్తి తన వాంగ్మూలం లో ఒప్పందం వెనుక చొర వ చూపిన వారిలో సిగ్నోరా గాంధీ ఒకరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీనే మధ్యవర్తులు వేలెత్తి చూపారని అధికార పార్టీ ప్రచారానికి దిగింది. కోర్టు డాక్యుమెంట్లలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అహ్మద్‌ పటేల్‌, ఆస్కర్‌ ఫెర్నాండజ్‌ పేర్ల ప్రస్తావన ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. లంచాలు తీసుకు న్నారని రుజువైతే, త్యాగీని శిక్షించడంతో పా టు రిటైర్డ్‌ వైమానిక దళాధిపతిగా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేయాలి. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ చేయడం, రాజకీయ లబ్ధి పొందాలని చూడడం క్షంతవ్యం కాదు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *