Home > Politics > చంద్రబాబు పోరాటం చేయాలి : ఉండవల్లి

చంద్రబాబు పోరాటం చేయాలి : ఉండవల్లి

టీటీడీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు
సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం

undavalli-arunkumar-apduniaరైతులకు గిట్టుబాటుధర శుద్ధ అబద్ధం. వైద్యానికి ఐదులక్షల బీమా పధకం లో అర్ధం పర్థం లేదని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు రాజమహేంద్రవరంలో అయన కేంద్ర బడ్జెట్ పై మాట్లాడారు. ఆంధ్రాకు గత నాలుగేళ్ళు గా బడ్జెట్ లో ఏం జరిగిందో ఇపుడూ అదే జరిగింది. విభజన చట్టంలోని విశాఖలో పెడతానన్న రిఫైనరీ ఇపుడు ముంబాయిలో పెడుతుంటే ఏమనాలని అన్నారు. చంద్రబాబు కేంద్రం లో మద్దతు ఉపసంహరించుకుంటే బిజేపీ ప్రభుత్వం పడిపోతుంది. పార్లమెంటు లో వెల్ లోకి వెళ్ళి తెదేపా ఎంపీలు పోరాటం చేస్తే ఏం రాలవు. ఆంధ్రాకు ఏమిచ్చినా కాంట్రాక్టర్ల కోసమేకానీ, ప్రజల కోసం కాదన్న అభిప్రాయం కేంద్రం లో వుందని అయన అన్నారు. చంద్రబాబు కు కేంద్రంతో పోరాటానికి ఇంకా ఛాన్స్ వుంది, నేరుగా పోరాటం చెయ్యాలి. బిజేపీ తో చంద్రబాబు కాపురం నిలిచేలా లేదు. అదే సోము వీర్రాజు మాట్లాడుతున్నారని ఉండవల్లి అన్నారు. తనపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు విలువివ్వనని అన్నారు. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు బిజేపీ కే మద్దతు వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి అని అన్నారు. ఎన్నికలు దగ్గరొచ్చాక తెదేపా, వైసీపీ లు ఇపుడు తమ తమ రాజకీయ ప్రయోజనాలు కోసం పోరాటం అంటున్నారని ఎద్దేవా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *