Home > Editorial > వామ్మె..హైదర`బాధ ` లు

వామ్మె..హైదర`బాధ ` లు

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్
ఉన్నత పదవికి సమ్మున్నతులు
 
dar_)apduniaపట్టపగలే నగరవాసులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. వెలుతురులోనే రోడ్డుపైకి రావాలంటే  జంకుతున్నారు… ఇక చీకటిపడితే ససేమిరా అంటున్నారు. వర్షం పడితే కాలు బయటకు పెట్టడం లేదు. ఎందుకీ పరిస్థితి… ఎక్కడ ఈ వింత పరిస్థితి అనుకుంటున్నారా… మన భాగ్యనగరంలోనే… అవునండీ జీహెచ్ ఎంసీ అధికారుల తీరుతో రహదారిపై వెళ్లలేని పరిస్థితి నెలకొంది.ఇవి మన భాగ్యనగరం రహదారులు…అడుగు తీసి అడుగేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి..గుంతలు పూడ్చాలని పాలకులు ఆదేశాలు ఇస్తున్నా… ఆచరణ మాత్రం అంగుళం కూడా కదలడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగర రహదారులు చిత్తడి నేలలుగా మారాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు జలమయమవుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ఇక రోడ్ల పైకి వస్తే భారీ గుంతలు వాహన దారులకు నరకం చూపిస్తున్నాయి.భాగ్యనగరంలో రోడ్డెక్కాలంటే జనం భయపడుతున్నారు… అడుగడుగునా ట్రాఫిక్ జామ్ లు… చిన్న చిన్న దూరాలకే గంటల కొద్దీ ప్రయాణం…, గుంతలు తేలిన రోడ్లు ప్రతిరోజూ మన సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం పెరగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టు రోడ్లను పెంచకపోవడమే.. నగరంలో 9 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా 600 కోట్లు వెచ్చిస్తున్నా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. పరిస్థితి మెరుగవడం సంగతి అటుంచితే రోజురోజుకు దిగజారుతోంది. భాగ్యనగర రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన వందల కోట్ల రూపాయల నిధులనూ ఖర్చు చేయలేకపోవడంతో అవన్నీ వెనక్కు వెళ్లాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే రోడ్ల పరిస్థితి మెరుగయ్యేదే.. కానీ గత దశాబ్ద కాలంగా ప్రతి యేడూ జరుగుతున్న తంతు ఇది. ఎలక్షన్లు దగ్గర పడడంతో హడావిడి పడుతూ ఆదరాబాదరాగా రోడ్ల మరమ్మతులు చేయిస్తున్నారు… అదీ నాసిరకమైన రోడ్లు.. ఒక్కవర్షానికే కొట్టుకుపోయే రోడ్లు.. ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఎలక్షన్ల కోసం వేస్తున్న రోడ్లు తప్పితే… సమస్యలను దూరం చేసే రోడ్లు కావు.. వాహనదారులకే కాదు.. నగరంలో పాదచారులకూ సరైన వసతులు లేని  హైదరాబాద్ లో ప్రతి చదరపు కిలోమీటర్ కు 7 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు ఉన్నాయి.. అదే ఢిల్లీలో ఒక చదరపు కిలోమీటరుకు 22 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి… దీనిని బట్టి నగరంలో రోడ్ల విస్తీర్ణం ఎంత తక్కువగా ఉందో అర్థం అవుతుంది… రోడ్లకు విరుద్ధంగా వాహనాల సంఖ్య ఏ ఏటికాఏడు పెరుగుతూ పోతున్నాయి… నగరంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు సగటున 723 వాహనాలున్నాయి… ఈ స్థాయిలో వాహన సాంద్రత ఉన్న నగరాల్లో హైదరాబాద్ తొలి మూడు స్థానాలలో ఒకటి… అంటే పెరుగుతున్న అవసరాలకు తగినట్టు నగరంలో రహదారుల అభివృద్ధి జరగనేలేదని స్పష్టమవుతోంది..రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా ఇతర రవాణా వ్యవస్థలు అభివృద్ధి జరగలేదు… ఎం.ఎం.టీ.ఎస్ చాలా కొద్ది ప్రాంతాలకే పరిమితమైంది.. యేళ్లు గడుస్తున్నా మెట్రో రైలు నిర్మాణ దశను దాటి ప్రారంభానికి నోచుకునేందుకు అపసోపాలు పడుతోంది.. మూసీని మురికి కాలువగా మార్చేసారు… దీంతో నగరంలో ప్రయాణం అంటేనే నరకం అన్నచందంగా మారింది…ఏదైనా రోడ్డు వేస్తే కనీసం 20ఏళ్లు ఉండాలి అనుకుందాం… హైదరాబాద్ రోడ్ల సగటు ఆయుష్షు మూడు నెలలే. మూడు నెలల్లోనే వారి రూపురేఖలు కోట్టుకుపోతున్నాయి. ఇప్పటికిప్పుడు 70 శాతం రోడ్లకు మరమ్మతు చేయాలి. మొత్తం రోడ్లలో 80శాతం రోడ్లపై వానపడితే వెంటనే నీళ్లు వెళ్లిపోయేలా సరైన డ్రైనేజీ లింక్ లేదు. అవసరమైన వంపు, వాలు లేవు. హైదరాబాద్ రహదారులు త్వరగా పాడైపోవడానికి మరో ప్రధాన కారణం నాసిరకం తారు. రోడ్లు వేయడంలోగాని, మెయింటెయిన్ చేయడంలోగానీ ఇంజినీరింగ్ స్టాండర్డ్స్ లేకపోవడం కూడా ప్రధాన సమస్య… అదేకాకుండా కేబుల్స్ కోసం సాగే తవ్వకాలతో మరింత డ్యామేజీ కలుగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com