Home > Bhakti > వరలక్ష్మీ పూజకు వేళాయెరా

వరలక్ష్మీ పూజకు వేళాయెరా

గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం
వరలక్ష్మివ్రతము వరలక్ష్మివ్రతము పురాణ గాధ

vara_apduniaశ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ముత్తైదువలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అనవాయితీ ఉన్న వారే ప్రతి యేడు క్రమం తప్పకుండా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి ప్రతి మతో వ్రతకల్పాన్ని పటిస్తూ పూజలు చేస్తారు. ఆరోజు కన్నెవడికిన దారాన్ని మూరెడు పొడవుతో తొమ్మిది వరుసలు పోస్తారు. దానికి పట్టుపోగు పెడతారు. వరలక్ష్మీ అమ్మవారి కథవింటూ తొమ్మిది ముడులు వేస్తా రు. కథా పఠనం పూర్తిఅయిన తర్వాత దారలను దేవు డి వద్ద పెడతారు. రవ్వలడ్డూలు నైవేధ్యంగా సమర్పిస్తారు. దేవుడి మండపం తీసే సమయంలో తొమ్మిది మూరల దండను మెడలో, ఐదు మూరల దండను కు డి చేతిలో ధరిస్తారు.పూర్వం చారుమతి అనే పుణ్యవతి తన తల్లిదండ్రులను అత్తామామలకు సేవలు చేస్తూ భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయవిధేయలతో ఉండేది. పతివ్రత అయిన చారుమతి కలలో ఒక రోజు వరలక్ష్మీ అమ్మవారు కనిపించి నీవు వచ్చే శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం నన్ను పూజిస్తే అష్టఐశ్వర్యాలు పొందుతావని చెప్పి అదృశ్యమవుతుంది. తెల్లవారిన తర్వాత రాత్రి వచ్చిన కల గురించి భర్తకు, అత్తమామలకు వివరిస్తుంది. ఆరోజు కోసం ఎదురుచూస్తుంది. శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంది. ప్రత్యేక మండపంలో దేవత ప్రతిమను ఉంచి ముగ్గులు వేసి తోరణాలతో అలంకరిస్తుంది. బ్రాహ్మణునిచే వ్రతం నిర్వహిస్తుంది. అనంతరం కొద్ది రోజుల్లోనే చారుమతికి అష్టఐశ్వర్యాలు సిద్ధించడంతో పాటు సత్‌సంతానం కూడా కలుగుతుం ది. నాటినుంచి వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు జరుపుకుం టూ వస్తున్నారు. మాంగళ్యబలం, అష్టఐశ్వర్యాలు, సంతానాభివృద్ధి జరగాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా మారింది.హిందువులు లక్ష్మీపూజ చేసే పర్వదినాల వంటి సందర్భాలు రెండు. ఒకటి దీపావళి అయితే మరొకటి శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రతి రోజు లక్ష్మీపూజ చేయవచ్చు. అయితే దీపావళి రోజూ, శ్రావణమాసంలోనూ ఏకరీతిన లక్ష్మీపూజ ఎలా చేయవచ్చంటే.. శ్రీ సూక్త మంత్రాలతో కానీ, లక్ష్మీ సహస్రనామాలతో కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కానీ లక్ష్మీ దండకం లేదా స్తుతి లో కానీ లక్ష్మీదేవిని అర్చించాలి. లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని శ్రభ్రంగా కడిగి, తుడిచి ఇంటి మధ్యలో ధాన్యాన్ని రాసిగా పోసి, దాని మీద తెల్లని వస్ర్తాన్ని కప్పి ఆ వస్త్రం మీద లక్ష్మీ విగ్రహాన్ని ఉంచి, ఆమెకు ఇష్టమైన తెల్లని పూలు, గంధము, వస్ర్ర్తాలు సమర్పిస్తూ పూజ చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *