Home > Vanitha > Recipes > సోయా గ్రాన్యూల్స్‌ తో వెజిటేబుల్ బిర్యానీ

సోయా గ్రాన్యూల్స్‌ తో వెజిటేబుల్ బిర్యానీ

చికెన్ రోస్ట్ తయారీ
క్యాబేజీ పకోడా

soya_apduniaకావలసిన పదార్థాలు :

సోయా గ్రాన్యూల్స్‌: అరకప్పు, నూనె: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, దాల్చినచెక్క: అంగుళంముక్క,యాలకులు: రెండు, ఇంగువ: చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు:అరకప్పు, పచ్చిబఠాణీలు: అరకప్పు, క్యారెట్‌ ముక్కలు: అరకప్పు, బాస్మతిబియ్యం: ఒకటిన్నర కప్పులు, కారం: పావుటీస్పూను, పసుపు: పావుటీస్పూను, దనియాలు-జీలకర్రపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కొత్తిమీర తురుము: పావుకప్పు

తయారుచేసే విధానం :

బియ్యం కడిగి ఐదు నిమిషాలు నాననివ్వాలి.సోయా గ్రాన్యూల్స్‌లో ఓ కప్పు వేడి నీళ్లు పోసి సుమారు పావుగంటసేపు నానబెట్టాలి. ప్రెషర్‌ కుక్కర్‌ లేదా పాన్‌లో నూనె వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. అవి చిటపటమన్నాక ఇంగువ, ఉల్లిముక్కలు వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. తరవాత క్యారెట్‌ ముక్కలు, పచ్చిబఠాణీలు, నానబెట్టిన బియ్యం, సోయా గ్రాన్యూల్స్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. కారం, పసుపు, జీలకర్ర-దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల వేడినీళ్లు పోసి, మూతపెట్టి రెండు విజిల్స్‌ రానివ్వాలి. చల్లారాక మూత తీసి కొత్తిమీర చల్లి వడ్డించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *