Home > Politics > గురువుకు ప్రధమ స్థానం :వెంకయ్య నాయుడు

గురువుకు ప్రధమ స్థానం :వెంకయ్య నాయుడు

వైసీసీలో అంతర్గత సంక్షోభం
ఎమ్మెల్యే రోజా పాదయాత్ర...

venkaiahnaidu-apduniaభగవంతుడు ఏమి కావాలో కోరుకోమంటే బాల్యం కావాలని అడుగుతానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.మంగళవారం నాడు రాజధాని అమరావతి దగ్గర ఐనవోలు గ్రామంలో విట్ ఏపీ క్యాంపస్ ను అయన, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. . డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అకడమిక్ బ్లాక్, సరోజినీ నాయుడు వసతిగృహం బ్లాకులను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ బాల్యంలో కల్మషం, భయం, సంకోచం ఉండదన్నారు. బాల్యంలో సంతోషం, ఉత్సాహంతో ఉండవచ్చన్నారు. సమాజంలో గురువుకు ప్రథమ స్థానం ఉందని అయన అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించడంలో మొదటి 10 సంస్థల్లో విట్ ఒకటన్నారు. విట్ ఏపీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. రాజధానికి వసతులు, వనరులు కల్పించడంలో తీవ్ర కృషి జరుగుతోందన్నారు. రాజధాని కల సాకారమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

నాలెడ్జ్ హబ్ గా అమరావతి : సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జీవితంలో అన్నింటికంటే విద్యార్థి జీవితం ముఖ్యమైనదని అన్నారు. విద్యలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందున్నారన్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీల్లో మనవాళ్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినవారిలో సత్య నాదెళ్ల ఉన్నారన్నారు. అలాగే, రాష్ట్ర రాజధాని అమరావతి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా మారబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో 27 టౌన్షిప్లు వస్తాయన్నారు. రాష్ట్రానికి మరిన్ని విద్యాసంస్థలు రాబోతున్నాయన్నారు. అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కాలుష్య రహిత నగరంగా అమరావతి మారబోతోందన్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com