Home > General > స్వచ్ఛ జిల్లా దిశగా విజయనగరం అడుగులు

స్వచ్ఛ జిల్లా దిశగా విజయనగరం అడుగులు

రుయాకు అవినీతి జబ్బు
చేదెక్కుతున్న చెరుకు

vijayanagaram-apduniaస్వచ్ఛ జిల్లా దిశగా విజయనగరం వడివడిగా అడుగులేస్తోంది. మూకుమ్మడి నిర్మాణాలతో లక్ష్యం చేరుకొనే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ఒకే రోజు 53 వేల మరుగుదొడ్లు నిర్మాణం పనులను ప్రారంభించారు. బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న ర‌హితంగా రూపొందే దిశ‌గా విజ‌య‌న‌గ‌రం జిల్లా వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబునాయుడు ఫిబ్ర‌వ‌రి 15 నాటికే ఓ.డి.ఎఫ్‌. జిల్లాగా రూపొందాల‌ని తాజాగా ఆదేశించ‌డంతో ఈ లక్ష్యం చేరుకొనే దిశ‌గా జిల్లా యంత్రాంగం తన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా రెండో విడ‌త మూకుమ్మ‌డి మ‌రుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా క‌లెక్ట‌ర్ వివేక్ యాద‌వ్ విజ‌య‌న‌గ‌రం గ్రామీణ మండ‌లం కొండ‌క‌ర‌కాంలో శ్రీ‌కారం చుట్టారు. 53వేల805 వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం ప‌నుల‌ను క‌లెక్ట‌ర్ కొండ‌క‌ర‌కాంలో ప్రారంభించారు. స్వ‌చ్ఛాంద్ర మిష‌న్ ప్రారంభ‌మైన నాటి నుండే జిల్లాలో వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం వేగ‌వంత‌మైన‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్‌గా వివేక్ యాద‌వ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మం ఉద్య‌మ రీతిని సంత‌రించుకుంది. స్వ‌చ్ఛాంద్ర మిష‌న్ ప్రారంభ‌మైన నాటి నుంచే జిల్లాలో వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం వేగ‌వంత‌మైన‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్‌గా వివేక్ యాద‌వ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మం ఉద్య‌మ రీతిని సంత‌రించుకుంది. మార్చినెలలో వంద గంట‌ల్లో ప‌దివేల మ‌రుగుదొడ్లు నిర్మించి దేశం దృష్టినే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆక‌ర్షించింది. సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఘ‌న‌త‌ను దేశమంతా చాటారు. రెండో విడ‌త‌గా అక్టోబ‌రు 25న 50 వేల మ‌రుగుదొడ్ల నిర్మాణానికి రామ‌భ‌ద్ర‌పురం మండ‌లం బూసాయ‌వ‌ల‌స‌లో శ్రీ‌కారం చుట్టారు. మూడో విడ‌త‌లో 53 వేల మ‌రుగుదొడ్ల‌కు శ్రీ‌కారం చుట్టారు. నాలుగో విడ‌త‌లో 50 వేల మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని ఒకేసారి ప్రారంభించ‌నున్నారు. నిర్మాణం పూర్త‌యిన మ‌రుగుదొడ్ల‌ను ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మ‌రుగుదొడ్ల నిర్మాణానికి ప్ర‌తిఒక్క‌రూ ముందుకువ‌చ్చి నిర్మించుకొనేందుకు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో జిల్లా క‌లెక్ట‌ర్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం వ‌ల్ల ల‌బ్దిదారులు వాటి నిర్మాణాన్ని చేప‌ట్టేందుకు ముందుకు వ‌స్తున్నారు. మ‌రుగుదొడ్డి నిర్మించుకున్నవారికి చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తున్నారు. గ్రామాల్లో మ‌రుగుదొడ్లు నిర్మించుకొనేందుకు త‌గిన స్థ‌లం లేని కుటుంబాల‌కోసం జిల్లా వ్యాప్తంగా 450 సామూహిక మ‌రుగుదొడ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాదించారు. గిరిజ‌న ప్రాంతాల్లో కొండ‌ల‌పై నివ‌సించే వారికోసం త‌క్కువ వ్య‌యంతో నిర్మించే ప్రి ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com