Home > General > ట్రాఫిక్ చట్రంలో విజయనగరం

ట్రాఫిక్ చట్రంలో విజయనగరం

బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయ్...
కొండెక్కిన గుడ్డు

vijayanagaram-apduniaరోజు రోజుకూ పెరుగుతున్న జనాభా…నిత్యం వివిధ పనులపై వచ్చే ప్రజలు….వాహనాల తాకిడి…ఇలా విజయనగరం పట్టణం ట్రాఫిక్ సమస్యలో చిక్కుకుంది. మార్కెట్ అంతా ఒకే చోట ఉండడంతో సమస్య మరింత జఠిలమైంది.విజయనగరం పట్టణంలో మూడున్నర లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వ్యాపార కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల వారు కొనుగోళ్ల నిమిత్తం వేలాది మంది నిత్యం పట్టణానికి వస్తుంటారు. మూడు లాంతర్ల నుంచి గంటస్తంభం వరకు సరుకుల అమ్మకాల రిటైల్ షాపులున్నాయి. గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం ప్రాంతంలో హోల్ సేల్ షాపులున్నాయి. గంటస్తంభాన్ని అనుకుని ఉన్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మార్కెట్ వివిధ రకాల వ్యాపారాలున్నాయి. దీంతో గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ఉండే మార్గమంతా ప్రతి రోజు రద్దీగా ఉంటుంది. ప్రధాన మార్కెట్ ప్రాంతానికి ఎంతోమంది వాహనాలపై వస్తుంటారు. అయితే మూడు లాంతర్ల నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కడా వాహనాల పార్కింగ్ లేకపోవడం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు గతంలో ప్రణాళికలు అమలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. మరలా యధావిధిగా ట్రాఫిక్ నిబంధనలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టడంతో కొంతమేర ట్రాఫిక్ రద్దీ సమస్య తగ్గుముఖం పట్టింది. చాలా రోజులుగా విజయనగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను ఓ కొలిక్కి తేవాలని పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసారు. జిల్లా పోలీసు అధికారి పాలరాజు ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ట్రాఫిక్ సమస్యపై శాఖాపరంగా సమీక్షించి, పరిష్కార మార్గాలను గుర్తించారు. మరో వైపు ఎం వి జి ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కూడా పట్టణంలో ట్రాఫిక్ సమస్య మూలాలపై ఓ నివేదిక తయారు చేసింది. పట్టణంలోని 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను గుర్తించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య మూలాలను గుర్తించిన పోలీసులు సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించడం ఎంత ముఖ్యమో, తిరిగి సమస్య తలెత్తకుంగా తగిన జాగ్రత్త వహించడం కూడా అంతే అవసరమని ఎస్ పి పాలరాజు అంటున్నారు. పురపాలక సంఘంతో కలిసి సమస్య పరిష్కారానికి ముందుకు వెళుతామని చెపుతున్నారు. విజయనగరం పట్టణంలో సుదీర్ఘంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా పోలీసులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *