Home > Politics > పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా : విజయశాంతి

పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా : విజయశాంతి

ఇంటికో ఉద్యోగం కాదు...ఊరుకో ఉద్యోగం రాలేదు : జగన్
ఓటు హక్కుపై అవగాహన వుండాలి : గవర్నర్ నరసింహన్

Vijayashanthi-apduniaఅనారోగ్య కారణాలతో పార్టీలో అక్టీవ్ గా లేను. కానీ అధిష్టానం తో టచ్ లోనే ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా. పార్టీని అధికారంలోకి తేవడమే నా లక్షమని మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేసారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి రేపటికి రెండు దశాబ్దాలు అవుతోంది. ఈ సందర్బంగా గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో లేను. పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరారని అన్నారు. సీఎం కేసిఆర్ కి ఓటు వేసి గెలిపించింది ప్రజలు. పాలన ఎలా ఉందో చెప్పాల్సింది ప్రజలు. కేసిఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు అని నాకు సమాచారం వుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా గొంతు నొక్కాయి. తెరాస ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. త్వరలో వాటిపై మాట్లాడుతానని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి రేపటికి 20సంవత్సరాలు. తెలంగాణ సాధించు కున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందంలోనా, పాలనలోనా స్మార్ట్ సీఎం నాకు అర్ధం కాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు తెలివైన వారు. ఓటుతో బదులిస్తారు. ఉద్యమం ను చులకన చేసి మాట్లాడిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులుగా చేసిన వారికే తెలియాలి. ఉద్యమం లో నుండి వచ్చిన సీఎం కేసిఆర్, ఉద్యమ కారులను జైలు లో పెట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గవర్నర్ కాదు. కేసిఆర్ పాలన ను ప్రజలు మెచ్చుకోవాలి. బాగా లేకుంటే బాగా లేదని గవర్నర్ ఒప్పుకొగలరా అని ప్రశ్నించారు. కేసిఆర్ పద్ధతి మార్చుకోవాలి. మంచి పాలన ను అందించాలి.
అధికారం శాశ్వతం కాదు. అతి విశ్వాసం తో ఉన్నారు అధికార పార్టీ నేతలని వ్యాఖ్యానించారు. ఒకే అంశం పై రోజుకో మాట మాట్లాడుతూ గాలికి వదిలేస్తాడు సీఎం కేసిఆర్. బంగారు తెలగాణ కాదు ఇది ఇత్తడి తెలంగాణ అని అభివర్ణించారు. నా 20సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులు చవి చూశా… వెన్ను పొటులు కుడా చూశానని విజయశాంతి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *