Home > General > బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయ్…

బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయ్…

అరకొరగానే సాగర్ నీరు
ట్రాఫిక్ చట్రంలో విజయనగరం

vijayawada-flyover-work-apduniaరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన కనకదుర్గ పైవంతెన వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇటీవల కాంట్రాక్టర్ సంస్థ గడువును పెంచుకుంది. వచ్చే ఏడాది 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.విజయవాడ నగరంలో జాతీయ రహదారిపై కనకదుర్గ దేవాలయం మీదుగా ఆరు వరుసల పైవంతెన నిర్మాణం నత్తనడక తలపిస్తోంది. నాలుగు వరుసల రహదారి, ఆరు వరుసల పైవంతెన ప్యాకేజీని రూ.448.60 కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీనిలో రూ.114.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అయితే ఇప్పటికే రూ.170 కోట్లవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది. రోడ్డు అయిదు కిలోమీటర్లు నాలుగు వరసలు, 2.50కిలోమీటర్లు పైవంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. పైవంతెన స్లాబ్‌ సెగ్మెంట్‌లను ముందుగానే గొల్లపూడిలో ప్రీకాస్టింగ్‌ చేసి బిగించాలి.కనకదుర్గ ప్లైఓవర్ పైవంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది పక్కన పెడితే నిర్మాణం త్వరగా సాగడానికి జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాల రాకపోకలను ఆపివేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ గుడి దగ్గర, హైదరాబాద్‌ వైపు కుమ్మరిపాలెం వద్ద పూర్తిగా రహదారిని మూసివేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో సమస్యలు చుట్టుముట్టాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఒకటి నుంచి ట్రాఫిక్‌ను విడుదల చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, నిర్మాణ ఏజెన్సీ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖకు లేఖ రాశారు. ఎక్కువ కాలం నిషేధించడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోయాయని, పోలీసు నియంత్రణ దాటిపోతోందని చెబుతున్నారు.వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వాహనాలను ఈరహదారిపై వదలాలని నిర్ణయించారు. అప్పటికి కనకదుర్గ దేవాలయం వరకు ఉన్న 23 పిల్లర్ల వరకు స్లాబ్‌ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కసరత్తు జరుగుతోంది. గత సెప్టెంబరు 11 నుంచి పైవంతెన మార్గంలో ఇరువైపులా పూర్తిగా వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి కుమ్మరిపాలెం వరకు పూర్తిగా నిషేధం అమలు లో ఉంటుంది. వాహనాలు వెళ్లకుండా శాశ్వత బారికేడ్లు నిర్మాణం చేశారు.జనవరి నాటికి కనకదుర్గ గుడి వరకు ఉన్న 23 పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేస్తున్నారు. మరో 50 రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందా.. అనేది ఇప్పుడు అనుమానంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *