Home > Bhakti > వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి
అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం

vinayaka-chaviti-apdunia-ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ
-గణేష్ ప్రతిమల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

జిల్లాలో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పర్వదిన వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మనోభావాలు, భక్తి భావానికి ఆటంకం కల్గకుండా ఉంటూనే వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో బుధవారం పలు ఆదేశాలు, సూచనలు చేశారు.

వినాయక ప్రతిమలు ఏర్పాటు కోసం ఆయా స్టేషన్లలో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల రాక పోకలకు ఇబ్బంది కల్గకుండా ఉండేలా మంటపాలు, ప్రతిమలు ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలను సందర్శించి అనువైన ప్రదేశమా కాదా… ప్రజలకు, వాహన రాకపోకలకు ఏమైనా అసౌకర్యం కలిగే అవకాశముందా అని పరిశీలించాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కల్గకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇబ్బందులేవీ లేకుంటే అనుమతి ఇవ్వాలన్నారు. గాలి, వర్షాలకు మంటపాలు కూలిపోకుండా… విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగకుండా ఉండేలా నిర్వాహకులకు సూచనలు చేయాలన్నారు. భక్తి భావనకు విరుద్ధమైన మద్యం, జూదం, రికార్డు డ్యాన్సుల్లాంటి కార్యకలాపాలు మంటపాల పరిసరాల్లో చేపట్టరాదన్నారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు తావివ్వరాదని… వ్యక్తుల/సమూహాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదన్నారు. భారీ మంటపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా రికార్డింగ్ సదుపాయమున్న సి.సి.కెమెరాలు అన్ని ఎంట్రీ, ఫార్కింగ్ స్థలాల్లో అమర్చుకోవాలన్నారు.బలవంతపు నిధుల సేకరణ జరుగరాదన్నారు.

మంటపాల వద్ద టపాసులు, తదితర పేలుడు వస్తువులు ఉంచరాదని… ప్రతిమల వద్ద వెలిగించిన దీపాల పట్ల జాగ్రత్తలు చేపట్టేలా నిర్వాహకుల్ని చైతన్యం చేయాలన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో సంబంధిత శాఖ నిబంధనలు అనుసరించి అధికారిక అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంటపాల వద్ద… ప్రతిమల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకూ 24 గంటలు సేవలందించేందుకు ముగ్గురు వలంటీర్లనునియమించుకోవాలని ..రాత్రి వేళల్లో కూడా ఒకరు తప్పనిసరిగా ప్రతిమల వద్దే అప్రమత్తంగా ఉండేలా తెలియజేయాలన్నారు. మంటపాల పరిసరాల్లో ఏదైనా ఘటన జరిగినా…జరిగే అవకాశమున్నా వెంటనే డయల్ – 100 లేదా 9989819191 నంబర్లకు సమాచారం అందించేలా ప్రజల్ని సమాయత్తం చేయాలన్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ముందస్తుగా నీళ్లు, ఇసుకతో నింపిన బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బాక్సు తరహా స్పీకర్లనే మంటపాల్లో ఉంచుకోవాలని…సమీప ప్రాంతాల్లో వున్న నివాసాల ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సౌండ్ సిస్టం ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం 6 నుంచీ రాత్రి 10 గంటల వరకు మాత్రమే…అందునా భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలన్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, న్యాయ స్థానాలకు వంద మీటర్ల పరిధి వరకూ నిశ్సబ్ద జోన్ గా టౌన్ ప్లానింగ్ వారు ప్రకటించడమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రతిమల ఏర్పాటు నుంచీ నిమజ్జనం వరకూ పోలీసు గస్తీ, నిఘా కొనసాగాలన్నారు. మంటపాల పరిసరాల్లో ఈవ్ టీజింగ్ , తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా ఉండేలా దృష్టి సారించాలన్నారు.ఈ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *